Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rana: కాంత తర్వాత దుల్కర్ సల్మాన్ ను నటచక్రవర్తి అని పిలుస్తారు: రానా దగ్గుబాటి

Advertiesment
Rana, Bhagyashree, Dulquer Salmaan

చిత్రాసేన్

, శుక్రవారం, 7 నవంబరు 2025 (14:57 IST)
Rana, Bhagyashree, Dulquer Salmaan
దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ డ్రామా కాంత నవంబర్ 14న విడుదల కానుంది. టీజర్, పాటలు అద్భుతమైన రెస్పాన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ రిలీజ్ తో ఇప్పుడు ఎక్సయిట్మెంట్ మరింత పెరిగింది. రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన ట్రైలర్ ఇంటెన్స్ ఎమోషనల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ తో అదిరిపోయింది.
 
ఒక రైజింగ్ స్టార్, అతనికి దారి చూపిన గురువు మధ్య ఉన్న ఎమిషన్ ని ట్రైలర్ ఆసక్తికరంగా ప్రజెంట్ చేసింది. ఈ ఇద్దరి డ్రీం ప్రాజెక్ట్ ‘శాంత’ దగ్గరకి వచ్చేసరికి ఇగో వార్ గా మారుతుంది. స్నేహం, ఆశయాల మధ్య నడిచే ఈ సంఘర్షణ ‘కాంత’ కథపై మరింత ఆసక్తిని పెంచింది. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్‌ ఈ కథను ఎమోషన్స్ హార్ట్ టచ్చింగ్ డ్రామాటిక్‌ సన్నివేశాలతో అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ క్రియేటివ్ విజన్ కనిపించింది.  
 
దుల్కర్‌ సల్మాన్‌ తన అద్భుతమైన నటనతో  వెర్సటిలిటీని నిరూపించాడు. గుర్తింపు కోసం ఆత్రుతగా ఉన్న కొత్త నటుడి నుంచి, స్టార్ డమ్ కు చేరిన తర్వాత ఈగోని ప్రదర్శించే స్టార్‌గా అతని ట్రాన్స్ఫర్మేషన్ అదిరిపోయింది. సముద్రఖని సహజమైన నటనతో గురువు పాత్రలో ఆకట్టుకున్నారు. భాగ్యశ్రీ బోర్స్‌ కథకు ప్రాణం పోసే పాత్రలో కనిపించారు. రానా దగ్గుబాటి పోలీస్‌ ఆఫీసర్‌గా ఎంట్రీ ఇవ్వడం కథలో కొత్త టెన్షన్‌, బలాన్ని తెచ్చింది.
 
డానీ సాంచెజ్‌ లోపెజ్‌ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరో హైలెట్. మోనోక్రోమ్‌ టోన్‌లో చూపించిన పీరియడ్‌ సెట్టింగ్‌ అద్భుతంగా కనిపిస్తుంది. ఆర్ట్‌ డైరెక్టర్‌ రామలింగం రూపొందించిన సెట్లు క్లాసిక్‌ సినిమాల యుగానికి మళ్లీ సజీవం పోశాయి. జాను చాంతర్‌ సంగీతం ప్రతి సీన్ ని ఎలివేట్ చేసింది
 
దుల్కర్‌ సల్మాన్‌ ‘వేఫేర్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్‌ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా వున్నాయి. ఇంటెన్స్ ఎమోషన్స్ తో ఆకట్టుకున్న ‘కాంత’ ట్రైలర్‌ సినిమాపై అంచనాలు మరింతగా పెంచింది.
 
దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ఈ సినిమాని కచ్చితంగా థియేటర్స్ లో చూడండి. ఎందుకంటే ఇది గ్రేట్ ఎక్స్పీరియన్స్. తెలుగు ఆడియన్స్ ఇచ్చే ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇది మాకు చాలా స్పెషల్ సినిమా. నా బెస్ట్ ఫ్రెండ్ రానా తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నేను వాళ్ళింట్లో అబ్బాయిలానే ఉంటాను. మేమిద్దరం కలసి సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. సెల్వ అద్భుతమైన కథతో వచ్చాడు. సముద్రఖని  గారితో కలిసి వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇందులో ఆయన మెమొరబుల్ పెర్ఫార్మన్స్ చూస్తారు. కుమారి పాత్రలో భాగ్యశ్రీ గారు చాలా డిఫరెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇందులో అద్భుతమైన మ్యూజిక్ వుంది.  ఇది మంచి డ్రామా, థ్రిల్లర్. డెఫినెట్ గా  థియేటర్స్ లో చూడండి. గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది.
 
హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. కాలాన్ని సినిమా మాత్రమే రీ క్రియేట్ చేయగలదు. నేను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ఏ స్టూడియోస్ లేవు. అందరూ విజయ స్టూడియో, వాహిని స్టూడియో, ఏవీఎన్ స్టూడియోలలో జరిగే మాట్లాడుకునే వాళ్ళు, స్టార్స్ గురించి చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడైతే సోషల్ మీడియా ఉంది. అప్పుడు స్టూడియోలో జరిగే విషయాలు చాలా తక్కువ మందికి తెలిసేది. అలాంటి ఒక్క బ్యాక్ డ్రాప్ లో సెల్వ  కథ చెప్పడం జరిగింది. కథ విన్న వెంటనే కచ్చితంగా ఈ సినిమా చేయాలనిపించింది. ఇలాంటి పీరియడ్ సినిమాకి దుల్కర్ సల్మాన్ లాంటి రెట్రో కింగ్ పర్ఫెక్ట్. నవంబర్ 14 తర్వాత దుల్కర్ ని మీరు అందరూ నటచక్రవర్తి అని పిలుస్తారు. భీమ్లా నాయక్ లో  సముద్రఖని గారి అబ్బాయిగా చేశాను. ఇందులో మా రిలేషన్ చాలా కొత్తగా ఉంటుంది. దుల్కర్, సముద్రఖని లాంటి అద్భుత నటుల మధ్య నిల్చుంది భాగ్యశ్రీ. నవంబర్ 14న మీ అందరినీ థియేటర్స్ లో కలుస్తున్నాం. థాంక్యూ.
 
భాగ్యశ్రీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇప్పటివరకు నా సినిమాలు చూశారు. ఈ సినిమాలో నేను యాక్ట్ చేయడం చూస్తారు. కాంత నాకు చాలా చాలా స్పెషల్. మీ అందరి ప్రేమకు థాంక్ యూ. ఈ సినిమాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Mammootty: లాస్ ఏంజెల్స్‌లోని అకాడమీ మ్యూజియంలో భ్రమయుగం ప్రదర్శన