Aadi sai kumar - Shambala
హీరో ఆది సాయి కుమార్ నటించిన మిస్టికల్ థ్రిల్లర్ శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్ ప్రస్తుతం అందరిలోనూ బజ్‌ను క్రియేట్ చేస్తూ ట్రెండ్ అవుతోంది. మరింత హైప్‌ను పెంచేలా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రం ట్రైలర్‌ను ఆవిష్కరించి, బృందానికి తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్రైలర్‌ను చూస్తే ఆడియెన్స్‌కి ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించబోతోన్నట్టుగా కనిపిస్తోంది.
కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి, అసురుడికి మధ్య జరిగిన ఓ భీకర యుద్దం.. ఈ కథకి మూలం.. అంటూ సాయి కుమార్ గంభీరమైన వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ఆరంభమైంది. అగ్ని పురాణం ప్రకారం ఆకాశంలో సంగ్రామం జరిగినప్పుడు దుష్ట శక్తులు జంతువుల్ని సైతం ఆవహిస్తాయి.. వాళ్లేమో చీమ కుట్టినా శివుడి ఆజ్ఞ అని నమ్ముతారు.. విక్రమ్ ఏమో చావులో సైతం సైన్స్ ఉందనే రకం.. మీరు చెబుతున్న శాస్త్రం మితం.. మీరు తెలుసుకోవాల్సిన మా శాస్త్రం అనంతం అనే డైలాగ్స్, ట్రైలర్‌లోని విజువల్స్, బీజీఎం, యాక్షన్ సీక్వెన్స్ చూస్తుంటే సరైన పాన్ ఇండియా కంటెంట్‌లా కనిపిస్తోంది.
ఆది సాయి కుమార్ యాక్షన్, అప్పియరెన్స్ మరింత పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నాయి. యుగంధర్ ముని మేకింగ్, ప్రవీణ్ కె బంగారి విజువల్స్, శ్రీ చరణ్ పాకాల హాంటింగ్ బీజీఎం నెవ్వర్ బిఫోర్ అనేలా ఉన్నాయి. ఇక నిర్మాతలు రాజశేఖర్ అన్న భిమోజు, మహీధర్ రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీని భారీ ఎత్తున నిర్మించారని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది.
ఇక ఈ ట్రైలర్‌లో అర్చన అయ్యర్, స్వశిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ పోషించిన ఇతర కీలక పాత్రలను కూడా పరిచయం చేశారు. ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర కథనానికి డెప్త్‌ను తీసుకు వచ్చినట్టు అనిపిస్తోంది. విజువల్ వండర్‌గా, అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేందుకు ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఆడియెన్స్ ముందుకు రానుంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక మూవీని భారీ ఎత్తున నిర్మించిన సంగతి తెలిసిందే.