Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

Advertiesment
Adi saikumar- Shambala

దేవీ

, గురువారం, 17 జులై 2025 (15:25 IST)
Adi saikumar- Shambala
యాక్టర్ ఆది సాయి కుమార్ ప్రస్తుతం ‘శంబాల : ఎ మిస్టికల్ వరల్డ్’ చిత్రంతో అందరినీ ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ సూపర్‌ నేచురల్ థ్రిల్లర్ మూవీ టీజర్ అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తించిన సంగతి తెలిసిందే. శంబాల టీం వదిలిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, మేకింగ్ వీడియో ఇలా అన్నీ కూడా సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారాయి. ఇక తాజాగా నిర్వహించిన నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) కార్యక్రమంలో ‘శంబాల’ టీజర్ హాట్ టాపిక్‌గా మారింది.
 
విదేశాలలో తెలుగు సంస్కృతి, సినిమా సెలెబ్రేట్ చేసే ప్రతిష్టాత్మక సమావేశాలలో ఒకటైన నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) 2025 కార్యక్రమంలో టాలీవుడ్ ప్రముఖులంతా సందడి చేశారు. ఈ క్రమంలో అక్కడ ‘శంబాల’ టీజర్‌ను ప్రదర్శించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్, సమంత, శ్రీలీల వంటి టాప్ స్టార్లు హాజరైన ఈ కార్యక్రమం ఘన విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో ‘శంబాల’ హాట్ టాపిక్‌గా నిలవడం విశేషం.
 
శంభాల టీజర్‌ను సంగీత దర్శకుడు ఎస్ థమన్ లైవ్ కచేరీలో ప్లే చేశారు. ఆయన అద్భుతమైన ప్రదర్శన వేదికను అలరించింది. కార్యక్రమానికి హాజరైన అతిరథ మహరథుల నుంచి ఈ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం ‘శంభాల: ఎ మిస్టికల్ వరల్డ్’ పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారీ స్థాయిలో ఈ మూవీని ఓ విజువల్ వండర్‌గా, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉండేలా నిర్మిస్తున్నారు.
 
యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ మూవీని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ వంటి వారు నటించారు. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా ప్రవీణ్ కె. బంగారి అద్భుతమైన విజువల్స్ అందించగా.. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం అందరినీ ఆకట్టుకునేలా ఉంది.  
 
టీజర్ రిలీజ్ చేసిన తరువాత సినిమా మీద ట్రేడ్ వర్గాల్లో అంచనాలు పెరిగాయి. థియేటర్ , ఓటీటీ రైట్స్ విషయంలో అందరూ పోటీ పడుతున్నారని తెలుస్తోంది. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను త్వరలోనే మేకర్లు ప్రకటించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ