దిగ్గజ నటుడు, అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో నాగర్జున మేనకోడలు, సుమంత్ సోదరి సుప్రియ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమెకు తోడుగా యంగ్ హీరో అడివి శేష్ కూడా కనిపించడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది. వీరిద్దరు కలిసి గూఢచారి సినిమాలో నటించారు. అప్పటి నుంచి వీరి ఇద్దరి మధ్య ఏదో ఉందని రకరకల వార్తలు వస్తూనే ఉన్నాయి.
అయితే ఈ వార్తలపై స్పందించిన అడివి శేష్ సింపుల్‌గా కొట్టిపారేశాడు. కానీ ఆ వార్తలను నిజం చేసేలా ఏఎన్నార్ అవార్డ్స్ కార్యక్రమంలో సుప్రియ, అడవి శేష్ కలిసి కనిపించడం ప్రస్తుతం కొత్త కథనాలకు దారి తీసింది.
ప్రస్తుతం వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకే అడివి శేష్ నాగ్ ఫ్యామిలీతో క్లోజ్‌గా ఉంటున్నాడని టాక్ వస్తోంది. మరి ఈ విషయంపై అడివి శేష్, సుప్రియ ఎలా స్పందిస్తారో చూడాలి.
సుప్రియ హీరో సుమంత్‌కి తోబుట్టువు కాగా, ఇరవై ఏళ్ల క్రితం 'అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి' చిత్రంలో పవన్ సరసన కథానాయికగా నటించింది. ఆ చిత్రం తర్వాత సినిమాలకి దూరంగా ఉన్న ఆమె ప్రస్తుతం తన మేనమామ నాగార్జునతో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూ ఉండిపోయింది. సుప్రియ అడవిశేష్ కంటే ఐదేళ్లు పెద్దది కాగా, వీరి పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలలో నిజమెంతో తెలియాలంటే వేచి చూడాలి.