Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Advertiesment
actress Santoshini, director Teja, Sreekar

చిత్రాసేన్

, గురువారం, 9 అక్టోబరు 2025 (17:20 IST)
actress Santoshini, director Teja, Sreekar
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 లో అత్యాధునిక సాంకేతికతతో 9 హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్‌ను గురువారం నాడు ఘనంగా  ప్రారంభించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మల్టీ మాడ్యులర్‌గా ప్రారంభించిన ఈ రిహాబిలిటేషన్ సెంటర్ విశేషాల గురించి ప్రతినిధులు పంచుకున్నారు. ఈ రిహాబిలిటేషన్ సెంటర్‌ను దర్శకుడు తేజ సినీనటి సంతోషిని, శ్రీకర్ కలిసి ప్రారంభించారు.
 
అనంతరం దర్శకుడు తేజ మాట్లాడుతూ .. జై సినిమా తరువాత మళ్లీ ఇన్నేళ్లకు సంతోషిని కలిశాను. చాలా సంతోషంగా ఉంది. సంతోషిని మరియు శ్రీకర్ కలిసి పెట్టిన ఈ రిహాబిలిటేషన్ సెంటర్‌ను పెట్టారు. హాస్పిటల్లో చికిత్స అందిస్తారు. కానీ ఆ తరువాత అందించాల్సిన సేవల్ని ఇంట్లో చేయలేం. ఇలాంటి సెంటర్లు చాలా అవసరం’ అని అన్నారు.
 
నటి సంతోషిని మాట్లాడుతూ .. నా భర్త ఆలోచన నుంచి వచ్చిందే ఈ రిహాబిలిటేషన్ సెంటర్‌. మా ఇంట్లోనే పెద్ద వాళ్లని చివరి రోజుల్లో చూసుకోలేకపోయాం. అందుకే ఇలాంటి రిహాబిలిటేషన్ సెంటర్‌లు ఉంటే బాగుంటుందని మేం ఆలోచించాం. మా ఆలోచనకు డా. శివ, డా. నాగరాజు ప్రాణం పోశారు. 24 గంటలు ఇక్కడ అన్ని రకాల సేవల్ని అందిస్తాం. మా రిహాబ్ సెంటర్‌లో చాలా తక్కువ ధరలకే అన్ని రకాల సేవల్ని అందిస్తున్నామ’ ని అన్నారు.
 
నిర్వాహకులు మాట్లాడుతూ .. ‘9 హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ మల్టీ మాడ్యులర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ప్రారంభించాం. ఈ రిహాబిలిటేషన్ అనేది మన ఇండియాలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. అయితే వెస్ట్రన్ కంట్రీస్‌లో మాత్రం ఎలాంటి ప్రమాదం జరిగినా, శారీరకంగా, మానసికంగా దెబ్బ తిన్నా కూడా.. రోగులకు ప్రభుత్వమే అక్కడ రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స అందిస్తుంటుంది. మనిషి బాధను తగ్గించేందుకు, పూర్వ స్థితిలోకి తీసుకు వచ్చేందుకు ఈ రిహాబిలిటేషన్ సెంటర్‌లు ఎంతో ఉపయోగపడుతాయి.
 
డా. శివ, డా. నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ సెంటర్‌ను మేం ప్రారంభించాం.  స్క్వీజ్ థెరపీ, స్వాలోయింగ్ థెరపీ, హియరింగ్ అండ్ డిస్పెన్స్, ఫిజియో థెరపీ, న్యూరో ఫిజియో థెరపీ, స్ట్రోక్ ఫిజియో థెరపీ, ఆర్థో ఫిజియో థెరపీ, చెస్ట్ ఫిజియో థెరపీ, జనరల్ ఫిజియో థెరపీ, పీడియాట్రిక్ ఫిజియో థెరపీ, జీరియాట్రిక్ ఫిజియో థెరపీ ఇలా అన్నింటినీ ఇక్కడ అందిస్తాం. అన్ని సేవల్ని కూడా పేషెంట్స్ కండీషన్స్ పట్టి ఛార్జ్ చేస్తాం. అందరికీ అందుబాటులో ఉండే ధరలతోనే సేవల్ని అందిస్తున్నాం. సమాజంలోని రుగ్మతల్ని తొలగించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. మా దగ్గర ఎమర్జెన్సీ సేవలు తప్పా మిగిలిన అన్నింటినీ అందుబాటులోకి తెచ్చాం’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్