Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అకీరా నందన్ సినిమా ఎంట్రీపై నిర్ణయం వాడిదే : రేణూ దేశాయ్

Advertiesment
Renu Desai

ఠాగూర్

, ఆదివారం, 5 జనవరి 2025 (17:14 IST)
తన కుమారుడు అకీరా నందన్ సినిమా ఎంట్రీపై ఆయన తల్లి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ స్పందించారు. రాజమండ్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కుమారుడు అకీరా సినిమా ఎంట్రీపై స్పందిస్తూ, తన కుమారుడు సినిమా ఎంట్రీ కోసం తాను కూడా అమితాసక్తితో ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. 
 
'నేను ఎక్కడికి వెళ్లినా నాకు ఎదురయ్యే ప్రశ్న అకీరా ఎంట్రీ గురించే. అందరి కంటే ఎక్కువగా ఒక తల్లిగా నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. కాకపోతే అది పూర్తిగా అతడి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. తను ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తాడు' అని తెలిపారు.
 
అలాగే, 'నేను ఎన్నిసార్లు సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఇవ్వాలి (నవ్వులు). ఇప్పటికే నాలుగైదుసార్లు సెకండ్‌ ఇన్నింగ్స్‌ అయిపోయింది. సినిమాల నుంచి చాలాకాలం బ్రేక్‌ తీసుకున్న తర్వాత 2017లో టీవీలో ఒక డ్యాన్స్‌ షోకు న్యాయ నిర్ణేతగా చేశా. ఆ తర్వాత టీవీ ఇండస్ట్రీలోనే కొన్ని వర్క్స్‌ చేశా. రెండేళ్ల క్రితం రవితేజతో ఒక సినిమా చేశా. మధ్యలో డైరెక్షన్‌ చేశా. ప్రస్తుతం నా చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. కాబట్టి నా వర్క్‌ అలా కొనసాగుతూనే ఉంది' అని ఆమె చెప్పారు. 
 
రాజమహేంద్రవరం గురించి మాట్లాడుతూ.. 'గోదావరి జిల్లాల్లో ఉన్నంత అద్భుతమైన లొకేషన్లు నేను ఎక్కడా చూడలేదు. విజయవాడ - రాజమహేంద్రవరం మధ్య పచ్చని పొలాలు చూసి నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఇదొక స్వర్గం. ఈ ప్రాంతంలో ఉండటం ఒక వరం' అని అన్నారు. సినిమా షూటింగ్స్‌ ఈ ప్రాంతాల్లో జరగాలనే ప్రభుత్వ పెద్దల నిర్ణయానికి ఆమె మద్దతు తెలిపారు. 
 
దాదాపు 22 ఏళ్ల తర్వాత ఒక యాడ్‌ కోసం వర్క్‌ చేశానని అన్నారు. అందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. యాడ్స్‌లో భాగం కావడాన్ని తాను ఎంతగానో ఇష్టపడుతుంటానని చెప్పారు. సినిమాల్లోకి రావాలని తాను ఎప్పుడూ అనుకోలేదని ఇదంతా విధి రాత అని ఆమె చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ పచ్చదనం ముచ్చటేసింది: రేణూ దేశాయ్