Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలనాటి నటి దేవిక చంపడానికి ట్రైచేసిందన్న భర్త దేవదాస్

Advertiesment
Devika, kanak, Devadas

డీవీ

, సోమవారం, 13 జనవరి 2025 (17:51 IST)
Devika, kanak, Devadas
బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో నటి దేవికది ప్రత్యేకమైన స్థానం. గండికోట రహస్యం వంటి విజయవంతమైన సినిమాల్లో నటించిన ఆమె పలు తమిళ సినిమాల్లోనూ నటించింది. నటిగా వున్నప్పుడు ఆమె దర్శకుడు దేవదాస్ తో మలయాళంలో సినిమా చేసింది. ఆ తర్వాత అతన్ని పెండ్లిచేసుకుంది. 1970లో ఆమె భర్త నుంచి విడిపోయింది. దాదాపు 7 సంవత్సరాలు మాత్రమే దాంపత్యజీవితం చేసిన ఆమె తనపై కుట్ర పన్నిందని దర్శకుడు దేవదాస్ తెలియజేస్తున్నారు. అలనాటి విషయాలనుతెలియజేసే క్రమంలో ఓ యూట్యూబర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.
 
వారిద్దరికీ పుట్టిన కనక కూడా నటిగా తెలుగులో నటించింది. కానీ ఆమె డ్రెగ్ కు బానిస అయిందనీ, అమ్మ దేవిక ఏది చెబితే అది చేసేదని అందుకే తనను తండ్రిగా హక్కు కోసమే సంతకం తీసుకుని ఆస్తిని కాజేయాలని జూసిందని దేవదాస్ వ్యాఖ్యానించారు. ఆస్తికోసం తనను చంపడానికి కూడా ట్రై చేసిందని తెలిపారు. ఇక దేవిక చనిపోయింది 2002లో. అప్పటినుంచి దేవదాస్ ఒంటరిగా వుంటున్నాడట. చెన్నై లో పాత భవంతిలో వుంటున్న ఆయన పలు విషయాలు చెబుతూ, దేవిక తనను మోసకాడిగా క్రియేట్ చేసిందని బాధను వ్యక్తం చేశాడు.

తను వెండితెరపై నటేకాదు. నిజజీవితంలో పెద్ద నటి అని పేర్కొన్నాడు. 1967 టైంలో ఆమెతో ఓ సినిమా చేశాక నా దగ్గరకు వచ్చి కాళ్ళపై పడి పెండ్లిచేసుకోమని ఏడ్చింది. నేను ఆమెను ప్రేమించలేదు. మా అమ్మగారు ప్రోద్బలంతో వివాహమాడాను. మాది నార్త్ నుంచి వచ్చిన ఫ్యామిలీ అంటూ తమిళ నటీమణుల కంటే తెలుగు నటీమణులు పెద్ద వివాదాల్లో వున్నారంటూ తెలిపారు కూడా. విడాకుల కేస్ లో లాయర్ చెప్పిన అబద్దాలను ఆమె చెప్పి తన పరువు తీసిందని అలాంటి ఆమె గురించి నేనేమీ పెద్దగా మాట్లాడకూదనుకున్నాను. ఇప్పటికే తనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వాల్సివచ్చిందని  80 ఏళ్ల దేవదాస్ పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కెరీర్ పరంగా గ్యాప్ రాలేదు... లాక్డౌన్ వల్లే ఆ గ్యాప్ : నిధి అగర్వాల్