Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Arjun: యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల మఫ్తీ పోలీస్

Advertiesment
Action King Arjun, Aishwarya Rajesh

దేవీ

, శుక్రవారం, 19 సెప్టెంబరు 2025 (18:07 IST)
Action King Arjun, Aishwarya Rajesh
యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ముఫ్తీ పోలీస్ చిత్రాన్ని నిర్మాత జి. అరుల్ కుమార్ సమర్పణలో జి.ఎస్. ఆర్ట్స్ నిర్మిస్తోంది. నూతన దర్శకుడు దినేష్ లెట్చుమనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పవర్ ఫుల్ టీజర్‌ లాంచ్ అయ్యింది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ టీజర్ థ్రిల్లింగ్ సన్నివేశాలతో అంచనాలను పెంచింది. ఇంటర్నెట్ అంతటా ప్రేక్షకుల నుండి ప్రశంసలను అందుకుంది.  
 
'కొన్నిసార్లు చట్టాన్ని దాటి న్యాయం ఉంటుంది. ఇంకొన్నిసార్లు న్యాయాన్ని దాటి ధర్మం ఉంటుంది. కానీ మొత్తం లెక్కవేసి చూస్తే చివరికి ధర్మమే గెలుస్తుంది' అని అర్జున్ చెప్పిన డైలాగ్ స్టొరీ సెంట్రల్ ఐడియాని ప్రజెంట్ చేస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఐశ్వర్య రాజేష్ ఇంటెన్స్ క్యారెక్టర్ లో ఆకట్టుకున్నారు. ఇన్వెస్టగేషన్ సీన్స్ థ్రిల్లింగ్ వున్నాయి. స్టైలిష్ మేకింగ్‌తో టీజర్ ఆకట్టుకుంది.  
 
ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ అభిరామి, రామ్‌కుమార్, జి.కె. రెడ్డి, పి.ఎల్. తేనప్పన్, లోగు, వేల రామమూర్తి, తంగదురై, ప్రాంక్‌స్టర్ రాహుల్, ఓ.ఎ.కె. సుందర్ తదితరులు నటించారు. శరవణన్ అభిమన్యు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, ఆశివాగన్ సంగీతం అందిస్తున్నారు. లారెన్స్ కిషోర్ ఎడిటర్. అరుణ్ శంకర్ ఆర్ట్ డైరెక్టర్,
 
ఈ సినిమా టీజర్ కు అద్భుతమైన స్పందన రావడంతో, మేకర్స్ ఇప్పుడు సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో, ట్రైలర్, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారు.
 ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో ఒకేసారి విడుదల కానుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Ram Charan : ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా రామ్‌ చరణ్‌