Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యుగ యుగాలకు గుర్తుండిపోయేలా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్

Advertiesment
Om routh, prabhas
Om routh, prabhas
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ప్రభాస్, కృతి సనన్ మరియు సైఫ్ అలీఖాన్ ప్రదాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రం జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఇక విడుదలకు ముందు, మేకర్స్ సినిమా ప్రమోషన్ విషయంలో విపరీతమైన శ్రద్ధ వహిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ ప్రమోషన్స్ అన్నీ చాలా వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు తిరుపతిలో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. 
 
ఎంతో ఘనంగా జరుగుతున్న ఈ ఈవెంట్ కు లక్షలాది ఫాన్స్ విచ్చేసారు. టీ సిరీస్ మరియు యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాను, తెలుగు ప్రేక్షకులకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అందిస్తున్నారు
 
ఇక ఈ కార్యక్రమానికి సినిమా యూనిట్ తో పాటు ముఖ్య అతిథి గా ప్రముఖ ఆద్యాథ్మిక గురు చిన్న జియర్ స్వామి గారు హాజరయ్యారు. పూర్ణ కుంభం తో ఆహ్వానిస్తూ ప్రభాస్ దగ్గరుండి వేదిక వద్దకు తీసుకువచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్న క్యారెక్టర్ చేయడానికి కూడా రెడీ : హీరో వి జె సన్నీ