బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్‌లో ప్రభాస్ - కృతి సనన్ జంటగా నటించిన చిత్రం "ఆదిపురుష్". ఈ చిత్రం ట్రైలర్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. ఇది మరో విజువల్ వండర్‌గా ఉంది. ఈ ట్రైలర్‌తో టీజర్‌కు వచ్చిన నెగెటివ్ కామెంట్స్ అన్ని పటాపంచలైపోయాయి. ఇందులో ప్రభాస్ లుక్స్ ఈ ట్రైలర్‌లో అదిరిపోయింది. ఇక ట్రైలర్ ఆఖరి షాట్ అయితే, మామూలుగా లేదు. శివలింగం ముందు సైఫ్ అలీఖాన్ కూర్చొని పూజ చేస్తున్న షాట్ అదిరిపోయింది. డైలాగ్స్ అయితే గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇక ఈ ట్రైలర్‌తో సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి.
రామాయణ ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రను పోషించగా, కృతిసనన్ సీత పాత్రలో కనిపించింది. టి సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రను పోషించారు. జూన్ 16వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. త్రీఫార్మెట్‌లో రూపొందించిన ఈ చిత్రం విడుదలకు మూడు రోజుల ముందే న్యూయార్క్‌లో జరిగే ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో మూడు రోజుల పాటు ఆదిపురుష్ మూవీ ప్రదర్శితం కానుంది.