Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఊరి కోసం చావాలి అనే సీ అడ్వెంచర్ ఫాంటసీ కథతో కింగ్స్టన్ ట్రైలర్

Advertiesment
GV Prakash Kumar, Divya Bharathi

దేవి

, శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (17:23 IST)
GV Prakash Kumar, Divya Bharathi
మ్యూజిక్ కంపోజర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన తాజా సినిమా 'కింగ్స్టన్'. తొలి భారతీయ సీ అడ్వెంచర్ ఫాంటసీ సినిమాగా 'కింగ్స్టన్' తెరకెక్కింది. ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్, జి స్టూడియోస్ సంస్థలు రూపొందించాయి. ఈ చిత్రాన్ని జీవీ ప్రకాష్ కుమార్ స్వయంగా నిర్మించడం విశేషం. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి తీసుకొస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో మార్చి 7న సినిమా థియేటర్లలోకి రానుంది.‌ తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు.
 
అనగనగా ఓ ఊరు... అది సముద్ర తీరంలో ఉంది. ఆ ఊరిలో ఏదో ఉందని, ఇంకేదో జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. 'ఒకరి అత్యాశ ఈ ఊరిని నాశనం చేసింది. మళ్ళీ నువ్వు ఆ తప్పు చేయకు' అని ఎందుకు ఒకరు చెప్పారు... సముద్రంలోకి హీరో ఎందుకు వెళ్ళాడు? ఆ తర్వాత 'ఒడ్డున ఎవరి కోసమో చావడం కంటే ఇక్కడ ఊరి కోసం చావాలి' అని హీరో ఎందుకు చెప్పాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సముద్రంలోకి హీరో వెళ్ళినప్పుడు అతని దగ్గరకు వచ్చిన దెయ్యాల కథ ఏమిటి? అనేది ఆసక్తికరం. సముద్రంలో సాహసాలను, దెయ్యాలను, ఫాంటసీనీ కలగలిపి ఒక రకమైన ఉద్వేగాన్ని కలిగించే విధంగా ఈ సినిమా ఉంటుందనే భావాన్ని ఈ ట్రైలర్ కచ్చితంగా కలిగిస్తుంది.
 
జీవీ ప్రకాష్ కుమార్ సరసన దివ్యభారతి హీరోయిన్ రోల్ చేసిన ఈ సినిమాలో చేతన్, అళగన్ పెరుమాళ్, ఎలాంగో కుమార్ వేల్, రాజేష్ బాలాచంద్రన్, అరుణాచలేశ్వరన్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఎడిటర్: సాన్ లోకేష్, ఆర్ట్: ఎస్ఎస్ మూర్తి, యాక్షన్: దిలీప్ సుబ్బరాయన్, సినిమాటోగ్రఫీ: గోకుల్ బినోయ్, మ్యూజిక్: జీవి ప్రకాష్ కుమార్, నిర్మాణ సంస్థలు: ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్, జి స్టూడియోస్, తెలుగులో విడుదల: గంగ ఎంటర్టైన్మెంట్స్, డిజిటల్ మార్కెటింగ్: టాక్ స్కూప్, పీఆర్వో: పులగం చిన్నారాయణ, నిర్మాతలు: జీవి ప్రకాష్ కుమార్, ఉమేష్ కేఆర్ భన్సాల్, దర్శకత్వం: కమల్ ప్రకాష్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆత్మ నేపథ్యం లో విరాజ్ రెడ్డి చీలం చిత్రం గార్డ్ - రివ్యూ