Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

Advertiesment
Jabilamma neeku antha kopama song

డీవీ

, శుక్రవారం, 31 జనవరి 2025 (18:23 IST)
Jabilamma neeku antha kopama song
ధనుష్ హీరోగా, దర్శకుడిగా, గాయకుడిగా, పాటల రచయితగా, నిర్మాతగా ఇలా సినీ పరిశ్రమపై తన ముద్ర వేస్తూనే ఉన్నారు. హీరోగా ఇప్పుడు ధనుష్ ఎంత బిజీగా ఉన్నా కూడా దర్శకత్వం సైతం వహిస్తున్నారు.  పా పాండి, రాయన్ తర్వాత ధనుష్ ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అనే సినిమాతో దర్శకుడిగా ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ధనుష్ హోమ్ బ్యానర్ అయిన వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌కె ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి.
 
రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం ఒరిజినల్ వెర్షన్‌తో పాటు ఫిబ్రవరి 21, 2025న తెలుగులోనూ విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఈ క్రమంలో మేకర్లు ప్రమోషనల్ కార్యక్రమాల్ని పెంచేశారు. తమిళంలో ఆల్రెడీ "గోల్డెన్ స్పారో" అనే పెప్పీ సాంగ్‌ సెన్సేషనల్‌గా మారిన సంగతి తెలిసిందే. జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన ఈ ఎనర్జిటిక్ పాట ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది.
 
ఇక ఇప్పుడు ఈ పాటను తెలుగులోనూ రిలీజ్ చేశారు. ఈ పాటను అశ్విన్ సత్య, సుధీష్ శశికుమార్, సుబ్లాషిణి అద్భుతంగా ఆలపించారు. రాంబాబు గోసాల రాసిన సాహిత్యం ఆకట్టుకుంటుంది. ఈ పాటలో ప్రియాంక మోహన్ లుక్స్, స్టెప్పులు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయి. యూత్‌ ఆడియెన్స్‌కు ఇట్టే కనెక్ట్ అయ్యే ఈ పాట ఇక తెలుగులోనూ చార్ట్ బస్టర్‌గా మారనుంది.
 
ఈ చిత్రంలో పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనాథన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫర్‌గా లియోన్ బ్రిట్టో, ఎడిటర్‌గా జి.కె. ప్రసన్న వ్యవహరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్