Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దంగల్ జైరా పబ్లిసిటీ కోసం ఏడ్చిందా.? అశోక్ గజపతి రాజు అలా అన్నారే?

దంగల్ నటి జైరా సంచలన ఆరోపణలు చేస్తూ, ఓ వ్యక్తి తనను విమానంలో తాకాడని, మెడ, వీపు నిమిరాడని ఏడుస్తూ సెల్ఫీ వీడియోను తీసి పోస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే జైరా ఆరోపణలను సదరు వ్యక్తి భార్య ఖండించింది.

Advertiesment
దంగల్ జైరా పబ్లిసిటీ కోసం ఏడ్చిందా.? అశోక్ గజపతి రాజు అలా అన్నారే?
, గురువారం, 14 డిశెంబరు 2017 (10:57 IST)
దంగల్ నటి జైరా సంచలన ఆరోపణలు చేస్తూ, ఓ వ్యక్తి తనను విమానంలో తాకాడని, మెడ, వీపు నిమిరాడని ఏడుస్తూ సెల్ఫీ వీడియోను తీసి పోస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే జైరా ఆరోపణలను సదరు వ్యక్తి భార్య ఖండించింది. తన భర్త అలాంటి వాడు కాదని కూడా చెప్పింది. సాక్షులు కూడా జైరాను సచ్ దేవా అనే వ్యక్తి వేధించలేదని చెప్తున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సచ్‌దేవా అమాయకుడని ఆ సాక్షి చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 
 
తానూ వారి వరుసలోనే కూర్చున్నానని, సచ్‌దేవా ఆ నటిని లైంగికంగా వేధించలేదని, అసభ్యంగా ప్రవర్తించలేదని సాక్షి చెప్పుకొచ్చాడు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు స్పందిస్తూ.. విమానాల్లో ప్రయాణికుల భద్రత తమకు అత్యంత కీలకమని, ఎక్కడైనా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటే తక్షణం చర్యలు తీసుకుంటున్నామన్నారు. 
 
పబ్లిసిటీ కోసం కొందరు సెలెబ్రిటీలు విమానాల్లో తమకేదో జరిగిపోతోందని ఆరోపిస్తున్నారని అశోక్ గజపతి రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విమానాల్లో వేధింపులు అత్యంత అరుదని, ఏ తప్పు చేసినా శిక్ష తీవ్రంగా ఉంటుందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసునని చెప్పారు. దీంతో ఈ వ్యవహారంలో జైరా అసత్యాలు చెప్పాల్సిన అవసరం ఏముందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వేధింపులు జరిగిన మాట నిజమేనని బాధితురాలు చెప్తుంటే సాక్షులు, కేంద్ర మంత్రి అశోక్ గజపతి లాంటి వారు కూడా ఆమెను వ్యతిరేకంగా కామెంట్లు ఇవ్వడంపై మండిపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజా అసలు పేరు ఏంటో తెలుసా? ట్రైనింగ్ ఇచ్చింది ఆయనే