శ్రీలీల తన కెరీర్‌లో తొలి ఐటెం సాంగ్‌ను ఇటీవలి బ్లాక్‌బస్టర్ 'పుష్ప 2'లో చేసింది. తెలుగు ప్రేక్షకులు ఈ పాట పట్ల పెద్దగా ఆసక్తి చూపనప్పటికీ.. హిందీ ప్రేక్షకులు మాత్రం బాగా కనెక్ట్ అయ్యారు. తాజా సమాచారం ప్రకారం, ఒక ప్రముఖ బాలీవుడ్ స్టూడియో తన రాబోయే మల్టీస్టారర్ చిత్రంలో ఒక ప్రత్యేక పాటలో నటించమని ఆమెను సంప్రదించింది. ఈ చిత్రం కూడా పాన్-ఇండియన్ విడుదల కానుంది.
శ్రీలీల డ్యాన్సుకు ఉత్తరాది ప్రేక్షకులు బాగా ఫిదా అవుతున్నారు. శ్రీలీల డ్యాన్స్ స్టెప్పులు చూసి సూపర్బ్ అంటున్నారు. ఉత్తర భారతదేశంలో ఆమెకు ఇటీవల లభించిన ప్రజాదరణ కారణంగా ప్రస్తుతం మరో బాలీవుడ్ సాంగ్ కనుక శ్రీలీల చేస్తే అది ఆమె సినీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని టాక్ వస్తోంది. అయితే
శ్రీలీల ఈ ఆఫర్‌కు అంగీకరిస్తుందా? ఆమె సినిమాలో కాకుండా ఐటెం సాంగ్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతుందా?
అనేది తెలియాల్సి వుంది.
ఇకపోతే.. శ్రీలీల వరుణ్ ధావన్ కొత్త చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాల్సి ఉంది. కానీ తరువాత ఆమె స్థానంలో పూజా హెగ్డేను తీసుకున్నారు. దీంతో శ్రీలీల బాలీవుడ్ అరంగేట్రం ఎలా ఉంటుందో తెలియాలంటే వేచి చూడాలి.