గబ్బర్ సింగ్ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ఇంతకుముందు కథానాయకుడిగా సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ కొన్ని కారణాలవల్ల అది చివరి నిముషంలో వర్కవుట్ కాలేదు. తాజాగా మరోసారి ఆయన్ను వెండితెరపైకి తీసుకురావాలని దర్శకుడు వేణు యెల్దండి కంకణం కట్టుకున్నాడు. తొలి చిత్రం బలగం తర్వాత నిర్మాత దిల్ రాజు అగ్రిమెంట్ వల్ల ఆ సంస్థలోనే వున్నాడు. తాజాగా యెల్లమ్మ సినిమా చేయబోతున్నాడు నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు కూడా. కానీ హీరోనే ఫైనల్ కాలేదు.
ఈ సినిమాకు ముగ్గురు హీరోలు తెరముందుకు వచ్చినా వెనుకడుగు వేశారు. కారణాలు ఏమైనా.. ఫైనల్ గా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తెరముందుకు వచ్చాడు. దీని కోసం ఆయన బాడీని కూడామార్చుకున్నాడు. ఫిలింనగర్ కథనాలు ప్రకారం త్వరలో సెట్ పైకి వెళ్ళనుంది. కానీ ఇంకా వారు కన్ ఫర్మ్ చేయలేదు.
కాగా, ఈ సినిమాకు మొదట బాలీవుడ్ సంగీత దర్శకుడు ద్వయం అజయ్-అతుల్‌ను సంప్రదించారని తెలిసింది. కానీ షడెన్ గా తనే సంగీతం సమకూరుస్తానని దేవీశ్రీ చెప్పినట్లు మరో కథ కూడా వినిపిస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియకానున్నాయి. కాగా, ఈ సినిమాకు కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.