Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముమైత్ ఖాన్‌: వెండితెర పైనుంచి బుల్లి తెరపైకి జారి పడింది

Advertiesment
Mumaith khan
, శనివారం, 20 ఫిబ్రవరి 2021 (19:27 IST)
ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే అంటూ యువతను ఉర్రూతలూగించింది ముమైత్ ఖాన్. ఆ పాట మహేష్ బాబు కన్నా ముమైత్ ఖాన్‌కు మంచి పేరు తెచ్చి పెట్టింది. పోకిరి సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్ చేసింది. అయితే ఆ తరువాత ఎన్ని పాటలకు నృత్యం చేసినా ముమైత్ ఖాన్‌కు పెద్దగా మైలేజ్ రాలేదు.
 
కానీ డిక్టేటర్ సినిమాలో ఒక గీతాన్ని బాలక్రిష్ణతో ఆలపిస్తూ కాలు జారి గోడను కొట్టుకుని ముమైత్ తలకు పెద్ద దెబ్బే తగిలింది. ఇక ఆమె కోలుకోవడానికి మూడేళ్ళకు పైగా పడుతుందని వైద్యులు స్పష్టం చేశారు. తలలో బ్లీడింగ్ ఫుల్లుగా రావడంతో ఇక ముమైత్ ఖాన్ బతకడం కూడా కష్టమే అనుకున్నారు బంధువులు.
 
అయితే దేవుడు దయ వల్ల తను మూడు నుంచి నాలుగు నెలల్లోనే కోలుకున్నానని ముమైత్ ఖాన్ ఆ తరువాత చెప్పారు. అడపాదడపా అప్పుడప్పుడు చిన్నచిన్న డ్యాన్స్ ఎపిసోడ్లలో ఆమె చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య ఆమె కొన్ని ఎపిసోడ్‌లలో ఏడుస్తూ కనిపించారు కూడా. ప్రస్తుతానికి బుల్లితెరలో డ్యాన్సు షోలకి జడ్జిగా వ్యవహరిస్తున్న ముమైత్, వెండితెరపైన అవకాశాలు ఎప్పుడు వస్తాయోనని చూస్తోందట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#TuckJagadishteaser నుంచి మోషన్ పోస్టర్.. కర్ర పట్టుకున ఫైట్‌కు నాని