దర్శకుడు ఆ మాట అనేసరికి పక్కకెళ్లి ఏడ్చాను... నటి ప్రగతి
తల్లి, అక్క, వొదిన పాత్రల్లో నటించే ప్రగతి ఈ క్యారెక్టర్లను తనకు 25 ఏళ్లునప్పుడే చేయాల్సి వచ్చిందట. తను అక్కాచెల్లెళ్లు సీరియల్లో నటిస్తున్నప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి తనకు కాల్ వచ్చిందట. ఆర్తీ అగర్వాల్ తల్లిగా నటించమని అడిగారట. ఐతే తల్లి
తల్లి, అక్క, వొదిన పాత్రల్లో నటించే ప్రగతి ఈ క్యారెక్టర్లను తనకు 25 ఏళ్లునప్పుడే చేయాల్సి వచ్చిందట. తను అక్కాచెల్లెళ్లు సీరియల్లో నటిస్తున్నప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి తనకు కాల్ వచ్చిందట. ఆర్తీ అగర్వాల్ తల్లిగా నటించమని అడిగారట. ఐతే తల్లి క్యారెక్టర్ అనేసరికి తను కొద్దిసేపు తటపటాయించిందట. ఇంతలో తన పక్కనే వున్న శ్రీవిద్య... నువ్వు హీరోయిన్ గా చేయాలని అనుకుంటున్నావా... లేదంటే సినిమా ఇండస్ట్రీలో బిజీ తారగా వుండాలని అనుకుంటున్నావా అని ప్రశ్నించిందట.
హీరోయిన్ కావాలంటే ఆ సమయం వచ్చేవరకూ ఆగాల్సి వుంటుందనీ, అది క్లిక్ అయితే సరి లేదంటే మరికొన్నాళ్లు ఎదురుచూడాల్సి వస్తుందని చెప్పిందట. తన మాట విని సురేష్ సంస్థ వంటి పెద్ద బ్యానర్లో నటిస్తే కెరీర్ బావుంటుందని చెప్పడంతో సరేనని చెప్పానని వెల్లడించింది.
అలాగే నాగార్జున హీరోగా నటించిన ఢమరుకం చిత్రంలో అనుష్కకు తల్లి క్యారెక్టర్లో నటిస్తున్న సమయంలో అనుష్క తనవైపు చూసి ఇంత చిన్నవయసు వున్న అమ్మాయిని నాకు తల్లి పాత్రలో నటింపజేస్తున్నారా అని బాధతో అంది. ఐతే నేను మాత్రం ఆ పాత్రలో నేను నటిస్తానని చెప్పాను అని గుర్తు చేసుకుంది. ఆ తర్వాత ఓ చిత్రంలో హీరోయిన్ గా నటించాలని కాల్ వస్తే ఎంతో ఆత్రంగా వెళ్లాననీ, ఐతే హీరో ఎవరని అడిగితే.... నేనే అని ఓ డైరెక్టరు అనడంతో పక్కకి వెళ్లి ఏడ్చానని చెప్పింది.