Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేక పెట్టిస్తున్న క్రిష్‌కు సూపర్ ఆఫర్ ఇచ్చిన కంగనా... డబ్బులు కూడా ఇచ్చేసిందట...

టాలీవుడ్ ఇండస్ట్రీని కేక పెట్టిస్తున్న దర్శకుల్లో క్రిష్, ఎస్ఎస్ రాజమౌళి పేర్లు ఇప్పుడు బాగా వినబడుతున్నాయి. దీనికి వేరే కారణాలు కూడా లేకపోలేదు. అవేంటయా అంటే, రాజమౌళి, క్రిష్‌ల మార్కెట్లు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని దాటేసి బాలీవుడ్ దాకా వెళ్లిపోయాయి

Advertiesment
కేక పెట్టిస్తున్న క్రిష్‌కు సూపర్ ఆఫర్ ఇచ్చిన కంగనా... డబ్బులు కూడా ఇచ్చేసిందట...
, సోమవారం, 3 ఏప్రియల్ 2017 (14:15 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీని కేక పెట్టిస్తున్న దర్శకుల్లో క్రిష్, ఎస్ఎస్ రాజమౌళి పేర్లు ఇప్పుడు బాగా వినబడుతున్నాయి. దీనికి వేరే కారణాలు కూడా లేకపోలేదు. అవేంటయా అంటే, రాజమౌళి, క్రిష్‌ల మార్కెట్లు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని దాటేసి బాలీవుడ్ దాకా వెళ్లిపోయాయి. దీనితో వీరిద్దరికీ బాలీవుడ్ సినీ ఆఫర్లు విపరీతంగా వచ్చేస్తున్నాయి. 
kangana -krish
 
ఎస్ఎస్ రాజమౌళి త్వరలో తను మహాభారతం నిర్మిస్తానని చెప్పారు. మరోవైపు సల్మాన్ ఖాన్ మాత్రం రాజమౌళితో ఒక్క సినిమా చేయాలని అడుగుతున్నారట. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథతో వచ్చిన భజరంగీ భాయిజాన్ ఎంతటి సూపర్ హిట్ కొట్టిందో తెలిసిందే. ఈ నేపధ్యంలో రాజమౌళి కోసం సల్మాన్ ఎదురుచూస్తున్నారట. 
 
ఇదిలావుంటే బాలీవుడ్ సెక్సీ క్వీన్ కంగనా రనౌత్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే... ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత గాధను ఆధారం చేసుకుని తెరకెక్కించే చిత్రాన్ని దర్శకత్వం వహించే అవకాశాన్ని క్రిష్ కు అప్పగించిందట కంగనా. ఇందులో విశేషమేమిటంటే.. ఈ చిత్ర నిర్మాతగా కూడా కంగనానే వ్యవహరిస్తోంది. ఈ చిత్రానికి మణికర్ణిక అనే టైటిల్ ఖరారు చేశాడట క్రిష్. ఇప్పటికే బాలయ్యతో గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం తీసి విజయం సాధించాడు. ఈ నేపధ్యంలో కంగనా రనౌత్ ఈ భారీ ప్రాజెక్టును క్రిష్ కు అప్పగించినట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజాతో కలిసి మెగా బ్రదర్ మరీ ఇంత దిగజారిపోయారేం...? 'జబర్దస్త్' కామెంట్స్...