Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నన్నలా చూస్తే పూరీ తట్టుకోలేడు... ప్రపంచమంతా శృంగారం చుట్టూనే... నటి హేమ

టాలీవుడ్ నటీనటుల్లో ఉన్నదివున్నట్లుగా ముఖం మీదే మాట్లాడేవారు ఎవరయా అంటే, పోసాని కృష్ణమురళి, నటి హేమల గురించి చెప్తారు. దేని గురించి అయినా దాచుకుని మాట్లాడటం వారికి చేతకాదు. కుండబద్ధలు కొట్టినట్లు ముఖం మీదే తేల్చి చెప్పేస్తారు. తాజాగా నటి హేమ పూరీ జగన

Advertiesment
నన్నలా చూస్తే పూరీ తట్టుకోలేడు... ప్రపంచమంతా శృంగారం చుట్టూనే... నటి హేమ
, బుధవారం, 2 ఆగస్టు 2017 (12:37 IST)
టాలీవుడ్ నటీనటుల్లో ఉన్నదివున్నట్లుగా ముఖం మీదే మాట్లాడేవారు ఎవరయా అంటే, పోసాని కృష్ణమురళి, నటి హేమల గురించి చెప్తారు. దేని గురించి అయినా దాచుకుని మాట్లాడటం వారికి చేతకాదు. కుండబద్ధలు కొట్టినట్లు ముఖం మీదే తేల్చి చెప్పేస్తారు. తాజాగా నటి హేమ పూరీ జగన్నాథ్ చిత్రాల్లో అవకాశాలు రావడం లేదని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చింది. తనకు ఎక్కువగా అక్క, వొదిన క్యారెక్టర్లు వస్తుంటాయనీ, ఐతే అమ్మ క్యారెక్టర్లు కూడా చేయమని కొందరు అడుగుతున్నారని చెప్పుకొచ్చింది. ఇలాంటి క్యారెక్టర్లో పూరీ జగన్నాథ్ నన్ను చూస్తే తట్టుకోలేరనీ, అందువల్ల తనకు ఛాన్సులు ఇవ్వడం లేదని స్పష్టీకరించింది. 
 
ఇండస్ట్రీలో కొందరు నటీమణులు డ్రగ్స్ తీసుకుంటున్నారనే విమర్శలపై మీరేమంటారన్న ప్రశ్నకు ఇంతెత్తున లేచింది. మీకు సినిమావాళ్లు తప్ప మిగిలిన జనం కనబడరా అంటూ ఎదురు ప్రశ్న వేసింది. ఇప్పుడేంటి... ఒకప్పుడు ఇలాంటివి చాలానే వుండేవి. టెక్నాలజీ పెరగడంతో చిన్నవి కూడా చాలా పెద్దగా చూపించేస్తున్నారు. ఇప్పటి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు బాగా చదువున్నవారు కావడం వల్ల వారికిష్టమైతే ఎలాంటి సంబంధాలనైనా సాగిస్తారు. అందులో తప్పేముందని అంటూనే.. ప్రపంచం అంతా ఇప్పుడు కేవలం సెక్స్, డబ్బు చుట్టూనే కదా తిరుగుతున్నాయి అంటూ ఫైర్ అయ్యింది. ఐనా మన జాతి బుద్ధులే అంతకదా అంటూ విసవిసలాడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నడ నటుడు ఆత్మహత్య... భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కూడా...!