Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తేజ ఆఖ‌రికి ఆ హీరోతో సినిమా చేస్తున్నాడా..?

నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చిన తేజ‌.. బాల‌య్య‌, వెంక‌టేష్‌ల‌తో సినిమాలు చేసే ఛాన్స్ ద‌క్కించుకున్నాడు. ఆ త‌ర్వాత కొన్ని కార‌ణాల వ‌ల‌న ఎన్టీఆర్ బ‌యోపిక్ నుంచి త‌ప్పుకున్నాడు. ఇ

Advertiesment
తేజ ఆఖ‌రికి ఆ హీరోతో సినిమా చేస్తున్నాడా..?
, మంగళవారం, 19 జూన్ 2018 (22:14 IST)
నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చిన తేజ‌.. బాల‌య్య‌, వెంక‌టేష్‌ల‌తో సినిమాలు చేసే ఛాన్స్ ద‌క్కించుకున్నాడు. ఆ త‌ర్వాత కొన్ని కార‌ణాల వ‌ల‌న ఎన్టీఆర్ బ‌యోపిక్ నుంచి త‌ప్పుకున్నాడు. ఇక వెంకీతో సినిమా స్టార్ట్ చేస్తాడు అనుకున్నారు. మ‌రి... ఏమైందో వెంకీ సినిమా నుంచి కూడా త‌ప్పుకున్నాడు. దీంతో తేజ త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో అనేది ఆస‌క్తిగా మారింది. నాగార్జున కోసం క‌థ రెడీ చేస్తున్నాడు. త్వ‌ర‌లో నాగ్‌కి తేజ క‌థ చెప్ప‌నున్నాడు అని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. 
 
ఆ త‌ర్వాత తేజ రానా కోసం క‌థ రెడీ చేసాడు. ఈ చిత్రాన్ని కూడా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థే నిర్మించ‌నుంది అంటూ మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. రానా బిజీగా ఉండ‌డ‌టంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌డానికి టైమ్ ప‌డుతుంద‌ట‌. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో తేజ సినిమా చేయ‌నున్నాడ‌ట‌. ఇటీవ‌ల బెల్లంకొండ సురేష్ మా అబ్బాయితో సినిమా చేయ‌మ‌ని తేజ‌ని అడిగాడ‌ట‌. దీనికి తేజ ఓకే అన్నార‌ని స‌మాచారం. 
 
ప్ర‌స్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సాక్ష్యం సినిమా చేస్తున్నారు. త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఈ మూవీ పూర్తైన త‌ర్వాత తేజ సినిమా స్టార్ట్ కానుంద‌ని స‌మాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చికాగో వ్యభిచారం రాకెట్... శృంగారంలో పాల్గొన్న ఆ యాంకర్?