Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

`స‌లార్‌`కు అదిరిపోయే రేటు వ‌స్తోంది!

Advertiesment
`స‌లార్‌`కు అదిరిపోయే రేటు వ‌స్తోంది!
, బుధవారం, 3 మార్చి 2021 (18:36 IST)
Prabhas still
ప్ర‌భాస్ బాహుబ‌లి త‌ర్వాత ఆయ‌న కెరీర్ ఎక్క‌డికో వెళ్ళిపోయింది. ఆ సినిమాను చూశాక క‌న్న‌డ సినిమా ముఖ చిత్రం మారిపోయింది. కెజి.ఎఫ్‌. అనే సినిమాను కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెర‌కెక్కించాడు. అత‌నికి క‌న్న‌డ‌లో బిగ్‌షాట్ హోంబ‌లే ఫిలిమ్స్‌ నిర్మాణం చేసింది. ఇప్పుడు అదే నిర్మాణ సంస్థ అదే ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్‌తో స‌లార్ తీయ‌డంతోపాటు ప‌లు భాష‌ల్లో విడుద‌ల చేయ‌నుంది. విదేశీ మార్కెట్ కూడా బాగా పెర‌గ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు వున్నాయి. ఇప్ప‌టికే ఒక్కోటిగా చిత్ర యూనిట్ స‌లార్ కు సంబంధించిన వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తోంది.

తాజా విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను ప్ర‌ముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వంద కోట్లకు పైగానే ఇచ్చేందుకు రెడీగా వున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే కెజి.ఎఫ్‌. సినిమాను రెండు భాగాలుగా పెట్టి తీసిన హంబోలే సంస్థ ఇదేవిధంగా ఆక‌ర్ష‌ణీయ‌మైన రైట్స్‌ను రాబట్టుకుంది. అంత‌కంటే ఎక్కువ మొత్తంలో ప్ర‌భాస్ స‌లార్‌ను రాబ‌ట్టుకోవాల‌ని చూస్తుంద‌ని స‌మాచారం. ఇదే నిజ‌మైతే స‌లార్ నిర్మించిన నిర్మాత‌కు పంట పండిన‌ట్లే. ఇది థియేట‌ర్‌లో విడుద‌లైతే ఆ క్రేజ్ఎలా వుంటుందో కూడా చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మాయిపై మ‌న‌సుప‌డ్డ శిరీష్‌!