ప్రభాస్ రాముడైతే సీతగా కీర్తి సురేష్
, మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (14:35 IST)
keerthy suresh, adipurush
ప్రభాస్ నటించనున్న తాజా సినిమా `ఆది పురుష్`. ఇందులో రాముడుగా ప్రభాస్ నటిస్తున్నాడు. సీతగా కీర్తి సురేష్ నటిస్తుందని మంగళవారంనాడు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. గుల్షన్ కుమార్, టీసీరిస్ ఫిలిమ్స్ సమర్పణలో రూపొందుతోంది. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది. దాదాపు అన్ని భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పురాణంలోని ఓ అంశాన్ని తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆదిపురుష్, `సెలబ్రేటింగ్ విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్` అనేది శీర్షికగా పెట్టారు. ఇందులోనే కథంతా దాగివుంది. ఇంకా ఈ సినిమాకోసం అలనాటి అలంకరణలు, సెట్లు గురించి ఇతర వివరాలను తెలియజేస్తూ శివరాత్రినాడు పూర్తి వివరాలు తెలియజేయనుంది చిత్ర యూనిట్. ఇంకా ఇతర పాత్రలలను ఎవరెవరు పోషిస్తున్నారో త్వరలో తెలియనున్నాయి. ప్రస్తుతం మహేష్‌బాబుతో సర్కారువారి పాట సినిమాలో కీర్తి నటిస్తుంది. ఇటీవలే దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చింది.
తర్వాతి కథనం