Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంగారంలాంటి పిక్‌ను పాడుచేయ‌కండి అంటున్న ప్ర‌భాస్ ద‌ర్శ‌కుడు

Advertiesment
బంగారంలాంటి పిక్‌ను పాడుచేయ‌కండి అంటున్న ప్ర‌భాస్ ద‌ర్శ‌కుడు
, బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (13:40 IST)
KrishnaRaju, Prabhas
తన పెదనాన్న, సీనియర్ నటుడు కృష్ణంరాజుతో ప్రభాస్ పిక్ ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. అది అభిమానుల్లో సంద‌డి నెల‌కొంది. రాధేశ్యామ్ లొకేషన్ లో  తీసిన ఒక ఆహ్లాదకరమైన ఫొటోను ట్విట్టర్ లో  పంచుకుని అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు ప్రభాస్. కృష్ణంరాజు ప్రభాస్ కలిసి ఉన్న ఇలాంటి ఫొటో ఇప్పటిదాకా అభిమానులు చూసి ఉండరంటే అతిశయోక్తి కాదు.ప్రభాస్ యంగ్‌గా వున్న లుక్తో ఉన్న ఈ ఫొటోలో కృష్ణంరాజు సైతం జీన్స్ టీషర్ట్ జాకెట్తో ట్రెండీ లుక్ తో  కనిపిస్తున్నారు. ఆయనని ఇలాంటి లుక్ లో  ఇప్పటిదాకా అభిమానులు చూసి ఉండరేమో. కృష్ణంరాజు, ప్రభాస్ ఇద్దరూ  డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉంది ఈ పోజు. ఇది సినిమాలో భాగమా లేక షూటింగ్ గ్యాప్ లో  ఇలా సరదాగా దిగిన ఫొటోనా అన్నది తెలియదు.
 
కాగా, ఈ ఫొటోకు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ట్వీట్ చేస్తూ బంగారం లాంటి ఫొటో పాడుచేయ‌కండ‌ని..  అంటున్నాడు. ఈ సినిమా త‌ర్వాత నాగ్ అశ్విన్తో ప్ర‌భాస్ సినిమా చేస్తున్నాడు. అందుకు సంబంధించిన వివ‌రాలు ఈనెల 26న ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలిపాడు. అయితే నేను ఇంకా డేట్ ఫిక్స్ చేయ‌లేద‌ని నాగ్ తెలిపారు.  అలాగే ఈ భారీ చిత్రాల్లో పర్సనల్ గా ప్రభాస్ ఫ్యాన్స్ కు మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్లాన్ చేస్తున్న చిత్రమే. భారీ బడ్జెట్ తో స్కై ఫై థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాపై అప్డేట్స్ విషయంలో మాత్రం మేకర్స్ ఎక్కడా కూడా ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చెయ్యకుండా అప్ టు డేట్ ఇస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వావ్ కృష్ణా, నీ దాని ముందు నాదానికి అంత సీన్ లేదు: దిశా పటాని