Publish Date: Thu, 23 Mar 2023 (13:07 IST)
Updated Date: Thu, 23 Mar 2023 (23:19 IST)
లేడీ సూపర్ స్టార్ నయనతార దక్షిణాదిలోని అతిపెద్ద తారలలో ఒకరు. రాబోయే భారీ బడ్జెట్ డ్రామా జవాన్‌లో సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో కలిసి తన బాలీవుడ్ అరంగేట్రం కోసం సిద్ధంగా ఉంది. కోలీవుడ్‌లో నయనతార గురించి ఓ క్రేజీ న్యూస్ హల్‌చల్ చేస్తోంది.
షారుఖ్ ఖాన్‌తో జోడీ కట్టిన జవాన్ సినిమాలో నయనతార బికినీలో నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. నయనతార సినీ పరిశ్రమలో తన కెరీర్‌లో బోల్డ్ పాత్రలు చేసింది. కొన్ని సినిమాల్లో స్కిన్ షోకు కూడా వెనుకాడలేదు. అజిత్ నటించిన తమిళ చిత్రం బిల్లాలో ఆమె బికినీలో కనిపించింది.
తాజాగా అట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న జవాన్‌లో నయనతార బికినీలో నటించబోతోందని వార్తలు వస్తున్నాయి. ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని ఆ వర్గాలు వెల్లడించాయి.
నయనతార జవాన్ కోసం 10 కోట్ల పారితోషికం తీసుకుంది. ఇది సౌత్‌లో నయనతార రెండు సినిమాల రెమ్యునరేషన్‌తో సమానం. పెళ్లయ్యాక బికినీ వేసుకోవడం లాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందా? ఈ వార్తల్లో ఏమైనా నిజం ఉందా? అనేది తెలియాల్సి వుంది.
సెల్వి
Publish Date: Thu, 23 Mar 2023 (13:07 IST)
Updated Date: Thu, 23 Mar 2023 (23:19 IST)