దక్షిణాది సూపర్ స్టార్ నయనతార తన భర్త విక్కీ, ఇద్దరు పిల్లలతో కలిసి క్రిస్మస్ జరుపుకుంటున్న ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. గత జూన్‌లో దర్శకుడు విఘ్నేష్ శివన్‌ని పెళ్లాడిన నయనతార.. ఆ తర్వాత నాలుగు నెలలకే అద్దె తల్లి గర్భం ద్వారా కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆదివారం క్రిస్మస్ వేడుకలను నయన ఫ్యామిలీతో జరుపుకుంది. ఇందులో భాగంగా విఘ్నేష్ శివన్ తన పిల్లలతో కలిసి క్రిస్మస్ జరుపుకుంటున్న చిత్రాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. పెళ్లి తర్వాత మొదటి క్రిస్మస్ జరుపుకుంటున్న నయనతారకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి