ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా విజయం సాధించిన సందర్భంగా నేడు జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. ఖతార్‌లో జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్, అర్జెంటీనా తలపడగా, ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనా చారిత్రాత్మక విజయం సాధించింది. అర్జెంటీనా సాధించిన ఈ విజయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ప్రపంచకప్‌తో అర్జెంటీనాకు వచ్చే ఆటగాళ్లను సన్మానించేందుకు అర్జెంటీనా కూడా సిద్ధమైంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని అర్జెంటీనా అంతటా ఈరోజు జాతీయ సెలవుదినం ప్రకటించారు.
రాజధాని నగరం బ్యూనస్ ఎయిర్స్‌లో ప్రపంచకప్ విజయోత్సవాన్ని జరుపుకోవడానికి 10 లక్షల మందికి పైగా ప్రజలు అక్కడ గుమిగూడారు. దీంతో అర్జెంటీనా పండగ కళతో హోరెత్తింది.