సినీ పరిశ్రమలో ప్రతి బోడిగాడు సలహా ఇస్తున్నాడు - రవితేజ
నేను వెయ్యి రూపాయలు తీసుకుని తెలుగు సినీ పరిశ్రమలో పనిచేసిన రోజులున్నాయి. ఎంతో కష్టపడ్డా. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. అప్పుడు నన్ను ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు నా రేంజ్ మారింది. రవితేజ అంటే ఒక బ్రాండ్‌గా మారిపోయాను. ఇప్పుడు నేను చేసే సినిమాలకు ఎంత
Publish Date: Tue, 19 Dec 2017 (16:08 IST)
Updated Date: Tue, 19 Dec 2017 (16:12 IST)
నేను వెయ్యి రూపాయలు తీసుకుని తెలుగు సినీ పరిశ్రమలో పనిచేసిన రోజులున్నాయి. ఎంతో కష్టపడ్డా. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. అప్పుడు నన్ను ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు నా రేంజ్ మారింది. రవితేజ అంటే ఒక బ్రాండ్‌గా మారిపోయాను. ఇప్పుడు నేను చేసే సినిమాలకు ఎంత డబ్బులు తీసుకోవాలో నాకు తెలుసు. తెలుగు సినీపరిశ్రమలో ప్రతి బోడిగాడు సలహా ఇచ్చేవాడే.
ఏంటి రవితేజ అంత తీసుకుంటున్నావు. నీకు సినిమా అవకాశాలు రావు. అంత రెమ్యునరేషన్ అస్సలు తీసుకోకూడదు. ఇది నాకు కొంతమంది ఇచ్చే సలహా. నా చేతిలో సినిమాలు లేకున్నా ఖాళీగా ఉంటాను తప్ప నా రెమ్యునరేషన్‌ను తగ్గించను. ఇప్పటివరకు 8 కోట్ల రూపాయలు తీసుకుంటున్నా. ఆ రేటును మరో రెండు కోట్లు పెంచా. ఇప్పుడు నిర్మాత నాకు 10 కోట్లు ఇస్తే తప్ప సినిమాలో నటించనని తేల్చి చెబుతున్నాడట మాస్ మహరాజ్ రవితేజ. రాజా ది గ్రేట్ సినిమాతో భారీ విజయాన్ని సాధించిన రవితేజ రెమ్యునరేషన్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
TJ
Publish Date: Tue, 19 Dec 2017 (16:08 IST)
Updated Date: Tue, 19 Dec 2017 (16:12 IST)