Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సన్నీ లియోన్ షో చేస్తే తగులబెడుతాం.. లేకుంటే తగులబెట్టుకుంటాం.. ఎవరు?

బాలీవుడ్ హాట్ భామ సన్నీ లియోన్ ఏ కార్యక్రమానికైనా వస్తే వేలాదిమంది అభిమానులు క్యూ కడతారు. అంతేకాదు ఆమెతో సెల్ఫీలు, కరచాలనం చేసేందుకు ఎగబడుతుంటారు. అలాంటిది సన్నీ లియోన్ కార్యక్రమానికి వస్తే ఆమెను పెట్రోల్ పోసి తగులబెట్టడమో.. లేకుంటే తామే ఆత్మహత్యలు చ

Advertiesment
సన్నీ లియోన్ షో చేస్తే తగులబెడుతాం.. లేకుంటే తగులబెట్టుకుంటాం.. ఎవరు?
, మంగళవారం, 19 డిశెంబరు 2017 (15:56 IST)
బాలీవుడ్ హాట్ భామ సన్నీ లియోన్ ఏ కార్యక్రమానికైనా వస్తే వేలాదిమంది అభిమానులు క్యూ కడతారు. అంతేకాదు ఆమెతో సెల్ఫీలు, కరచాలనం చేసేందుకు ఎగబడుతుంటారు. అలాంటిది సన్నీ లియోన్ కార్యక్రమానికి వస్తే ఆమెను పెట్రోల్ పోసి తగులబెట్టడమో.. లేకుంటే తామే ఆత్మహత్యలు చేసుకోవడమే చేస్తామంటున్నారు కర్ణాటకకు చెందిన రక్షణ వేదిక యువసేన నాయకులు. 
 
రానున్న నూతన సంవత్సర వేడుకలకు సన్నీ లియోన్‌ను ముఖ్య అతిథిగా ఒక ప్రైవేటు సంస్థ ఆహ్వానించింది. ముంబైలో ఎన్నో సంస్థలు పిలిచినా సన్నీ లియోన్ మాత్రం బెంగుళూరులో ప్రదర్శన ఇవ్వడానికి సిద్థమైంది. డిసెంబర్ 31వ తేదీ ఉదయమే సన్నీ లియోన్ బెంగుళూరుకు రానుంది. అయితే సన్నీ లియోన్ కర్ణాటక రాష్ట్రానికి వస్తే తమ సంస్కృతి మొత్తం మంట కలిసిపోతుందనీ, సన్నీ లాంటి వ్యక్తి అస్సలు ఇక్కడకు రాకూడదని ఆందోళనలు మొదలయ్యాయి.
 
దయచేసి రావద్దండి.. ఒకవేళ ఆమె వస్తే మాత్రం ఆమెపై పెట్రోల్ పోసి తగులబెడతాం.. లేకుంటే మేమందరం కలిసి తగులబెట్టుకుంటామంటూ కర్ణాటక సంస్కృతి యువసేన నాయకులు హెచ్చరించారు. బెంగుళూరులో యువసేన నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వీటిని లెక్కచేయకుండా సన్నీలియోన్ నూతన సంవత్సరంరోజు కర్ణాటక రాష్ట్రానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇదిలావుంటే పోలీసులు సన్నీ లియోన్ ప్రదర్శనకు నో చెప్పారు. దీనితో నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఆడది తలుచుకుంటే అంతమందితో...' అంటూ నటి నవీన, పృథ్వి ఆవేదన