Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లి రద్దుకు కారణమైన కాగడాల పూలజడ

సాధారణంగా చిన్నచిన్న సంఘటనలకు పెళ్లిళ్లు ఆగిపోతుంటాయి. ఇలాంటి సంఘటనలు అనేకం చోటుచేసుకుంటున్న విషయంతెల్సిందే. ఇప్పుడు ఇలాంటి చిన్న విషయానికి ఓ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.

పెళ్లి రద్దుకు కారణమైన కాగడాల పూలజడ
, శనివారం, 28 అక్టోబరు 2017 (10:26 IST)
సాధారణంగా చిన్నచిన్న సంఘటనలకు పెళ్లిళ్లు ఆగిపోతుంటాయి. ఇలాంటి సంఘటనలు అనేకం చోటుచేసుకుంటున్న విషయంతెల్సిందే. ఇప్పుడు ఇలాంటి చిన్న విషయానికి ఓ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. మల్లె పువ్వులకు బదులుగా కాగడాలతో జడను అలంకరించారనే నెపంతో వివాహం రద్దైన ఘటన శుక్రవారం కర్ణాటక రాష్ట్రంలోని కృష్ణరాజపురం, హొసకోటె తాలూకాలో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... చిక్కనహళ్లి గ్రామానికి చెందిన ఆనంద్‌కు విజయపుర పట్టణానికి చెందిన యువతితో తాలూకాలోని భీమాకనహళ్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో వివాహం నిశ్చయించారు. శుక్రవారం దేవాలయంలో వివాహ పనులు ప్రారంభమైన కాసేపటికి వధువు పెళ్లి మండపంలోకి అడుగుపెడుతుండగా వధువు జడ అలంకారం విషయమై వధూవరుల కుటుంబాల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. 
 
మల్లెపువ్వులతో కాకుండా కాగడా మల్లెలతో వధువు జడను అలంకరించారంటూ వరుడు కుటుంబ సభ్యులు రాద్దాంతం చేశారు. సమయానికి మల్లెపువ్వులు లభించకపోవడంతో కాగడాలతో అలంకరించాల్సివచ్చిందంటూ వధువు కుటుంబ సభ్యులు ఎంతగానో నచ్చజెప్పారు. అయినప్పటికీ వరుడు కుటుంబ సభ్యులు వినిపించుకోకపోవడంతో ఇరు కుటుంబసభ్యుల మధ్య వాగ్వాదం శృతిమించింది. దీంతో వరుడు కుటుంబ సభ్యులు వివాహాన్ని రద్దు చేసుకుని వెళ్లిపోయారు. 
 
దీంతో ఏం చేయాలో తెలియని వధువు తల్లిదండ్రులకు తమ బంధువులకు చెందిన ఓ యువకుడు ముందుకు వచ్చి అదేముహూర్తానికి పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. దీంతో సమస్య అందటితో సద్దుమణిగిపోయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్నమ్మ, మామలు చేసే పాడు పని చూడలేక చనిపోతున్నా...