Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డైరెక్టర్ కోసం ఎంత కష్టమైనా ఓర్చుకుంటానంటున్న రష్మిక..

Advertiesment
Rashmika Mandanna
వరుస సినిమాలు, విజయాలతో చాలా సంతోషంగా ఉంది రష్మిక మందన. గ్యాప్ దొరికితే చాలు తన స్నేహితులతో తెగ ఎంజాయ్ చేసేస్తోంది రష్మిక. సినిమా ప్రారంభం నుంచి ముగిసే వరకు జోష్‌గానే పనిచేస్తానంటోంది రష్మిక. అయితే సినిమా నిర్మాత కన్నా డైరెక్టర్ కోసమే తాను ఎప్పుడూ కష్టపడుతూ ఉంటానని చెబుతోంది రష్మిక.
 
కొన్ని సన్నివేశాల్లో నటించడం చాలా కష్టం. అయితే డైరెక్టర్ ఎంతో కష్టపడి ఎలా నటించాలో చెబుతుంటారు. అప్పుడు నేను ఎంతో ఆశక్తిగా వింటూ ఉంటాను. ఇప్పుడే కాదు.. ఎప్పుడూ నేను ఇలాగే ఉంటాను. డైరెక్టర్ చెప్పినట్లుగా చేస్తేనే విజయం సాధిస్తుంది ఆ సినిమా. నాకు ఆ విషయం బాగా తెలుసు.
 
అందుకే డైరెక్టర్ ఎంత కష్టమైన సన్నివేశం ఇచ్చినా చేయగలను. బాష తెలియకపోయినా నేను ఆ సన్నివేశంలో ఒదిగిపోయే విధంగా చేసి తీరుతాను. గీత గోవిందం సినిమాలో నాకు బాష రాకపోయినా నేను నటించిన కొన్ని సన్నివేశాల్లో నేను చూపించిన హావభావాలు అందరినీ బాగా అలరించాయి. నన్ను బాగా మెచ్చుకున్నారు. డైరెక్టర్ నా దగ్గర అలాంటి సన్నివేశాలు చేయించారంటోంది రష్మిక.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందుకే.. మ‌త్తు వ‌ద‌ల‌రా అంద‌రికీ న‌చ్చుతుంది - కీరవాణి త‌న‌యుడు శ్రీసింహ