Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందం ఒకటే కాదు.. అది కూడా ఉండాలంటున్న కాజల్ అగర్వాల్

Advertiesment
Kajal Agarwal
, శుక్రవారం, 13 డిశెంబరు 2019 (21:45 IST)
అందం, అభినయంతో ఎన్నో సినిమాల్లో నటించి అగ్ర హీరోయిన్ల జాబితాలో సుస్థిరంగా నిలుస్తోంది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నా సరే మంచి కథను ఎంచుకుంటోందంటున్నారు సినీ విశ్లేషకులు. అటు దక్షిణాదిలోను, ఇటు ఉత్తరాదిలోను సుస్థిర స్థానాన్ని దశాబ్ధానికిపైగా కొనసాగిస్తున్నానంటే అదొక్కటే కారణమంటోంది కాజల్.
 
అందం ఒక్కటే కాదు మంచి నిర్ణయాలను తీసుకోవాలి. అది కూడా సకాలంలో తీసుకోవాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అలా నేను కొన్ని మంచి నిర్ణయాలను తీసుకున్నా. అది నాకు బాగా ఉపయోగపడ్డాయి. ఆ నిర్ణయాలు తీసుకోవడంలో నేను ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దానికి సత్తా ఉండాలి. అది నాలో ఉందనుకుంటా.
webdunia
 
సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాను కాబట్టే ఇంతదూరం ప్రయాణించగలిగానంటోంది కాజల్ అగర్వాల్. నిర్మాతలు, డైరెక్టర్లు తనపై పెట్టుకునే నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయనని చెప్పుకొస్తుంది కాజల్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ ఆవిడ కరాటేలో బ్లాక్ బెల్ట్ అంట కదా...