యాంకర్ టర్నడ్ డైరెక్టర్ ఓంకార్ తెరకెక్కించిన తాజా చిత్రం రాజు గారి గది 3. ఈ సినిమాకి రివ్యూస్ నెగిటివ్‌గా వచ్చాయి. అయితే... కలెక్షన్స్ మాత్రం ఫరవాలేదు అనిపించాయి. దీంతో ఓంకార్ ఆలోచనలో పడ్డాడట. ఎందుకంటే.. రాజు గారి గది సక్సస్ అయ్యింది. ఆ ఉత్సాహంతో రాజు గారి గది 2 తీసారు. అందులో నాగార్జున, సమంత ప్రధాన తారాగణంగా నటించినప్పటికీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వడంలో ఫెయిల్ అయ్యింది.
తాజాగా తెరకెక్కించిన రాజు గారి గది 3 కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఓంకార్ ఇక రాజు గారి గది సీక్వెల్స్ తీయకూడదు అని నిర్ణయించుకున్నారట. సక్సస్ సాధించకపోవడం ఓ కారణమైతే... ఈ సీక్వెల్స్ తీయడానికి సరిపోయే కథ ఓంకార్‌కి సెట్ కావడం లేదు. కథల కొరతగా బాగా ఉంది. అందుకనే రీమేక్‌లపై ఆధారపడుతున్నారు.
రెండవ పార్ట్ రాజు గారి గది 2కి మలయాళ చిత్రం ప్రీతంకి రీమేక్, రాజు గారి గది 3కి తమిళ కామెడీ చిత్రం థిల్లుకు థుడు 2 ఆధారంగా రూపొందించారు. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఓంకార్ కథల కోసం ఎంత కష్టపడ్డారో. కనుక.. ఇక రీమేక్‌లపై ఆధారపడి ప్లాప్ మూవీ తీయడం కన్నా... ఈ సీక్వెల్స్‌ని ఆపేయడం మంచిది అని నిర్ణయించుకున్నారట. అదీ సంగతి.