Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుష్ప-2లో ప్రియమణి... ఆయన కోసం రంగంలోకి..? (వీడియో)

Advertiesment
priyamani
, సోమవారం, 1 ఆగస్టు 2022 (18:48 IST)
పుష్ప-2 సినిమా కోసం ప్రియమణిని రంగంలోకి దించనున్నారు. వచ్చేనెల నుంచి 'పుష్ప 2'ను సెట్స్‌పైకి తీసుకుని వెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల కోసం బాలీవుడ్ నుంచి మనోజ్ బాజ్ పాయ్‌నీ, కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతిని ఎంపిక చేసుకున్నట్టుగా ప్రచారం జరిగింది. 
 
విజయ్ సేతుపతి జోడీగా ప్రియమణిని ఎంపిక చేశారనేది తాజా సమాచారం. ఆ పాత్రకి కూడా ప్రాముఖ్యత ఉండటం వల్లనే ఆమెను తీసుకున్నట్టుగా టాక్ వస్తోంది. అప్పుడే దేవిశ్రీ ఈ సినిమాకి బాణీలు కట్టే పనిలో పడిపోయాడని అంటున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనుంది పుష్ప టీమ్. 
 
ఇకపోతే.. ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా కొనసాగిన ప్రియమణి, రీ ఎంట్రీలోను మంచి అవకాశాలనే అందుకుంటోంది. ఈ మధ్య వచ్చిన 'నారప్ప', ఇటీవల వచ్చిన 'విరాటపర్వం' సినిమాలోను కీలకమైన పాత్రనే పోషించింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పబ్లిక్‌లో బిగ్ బాస్ ప్రేమికుల లిప్ లాక్.. వీడియో వైరల్