Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

NBK107: ఈలలతో రచ్చ రచ్చ చేసిన బామ్మ.. వీడియో వైరల్

Advertiesment
Old woman
, మంగళవారం, 26 జులై 2022 (16:10 IST)
Old woman
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. NBK107 అనే వర్కింగ్ టైటిల్‏తో ఈ సినిమా తెరకెక్కుతోంది. గోపిచంద్, బాలకృష్ణ కాంబోలో రాబోతున్న సినిమాలో బాలయ్య మరింత పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుండగా.. కథానాయికగా శ్రుతి హసన్ నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు.
 
ఇప్పటికే విడుదలైన బాలయ్య స్పెషల్ వీడియో, పోస్టర్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్నూల్, యాగంటి ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతుంది. 
 
బాలయ్య షూటింగ్ జరుగుతుందని తెలిసిన స్థానికులు ఆయనను చూసేందుకు తండోపతండాలుగా సెట్ వద్దకు తరలివచ్చారు. జై బాలయ్య, జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ విజిల్స్ వేస్తూ రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
అయితే బాలయ్యను చూసేందుకు వచ్చిన అభిమానులలో ఓ బామ్మా స్పెషల్ అట్రాక్షన్‏గా నిలిచింది. జై బాలయ్య.. జై బాలయ్య అంటూ విజిల్స్ వేస్తూ.. ఎంతో ఎనర్జీగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఆమెకు సంబంధించిన వీడియోను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. బామ్మా వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌