Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్న నయనతార

Advertiesment
nayanathara
, గురువారం, 14 సెప్టెంబరు 2023 (09:16 IST)
హీరోయిన్ నయనతార నటిస్తున్న చిత్రాలు వరుసగా విజయం సాధిస్తున్నారు. దీంతో ఆమె భారీ పారితోషికాన్ని డిమాండ్ చేశారు. నిజానికి మొదటి నుంచి కూడా నయనతార తీరు వేరు.. ఆమె దారి వేరు. ఎవరు ఎన్ని కామెంట్లు చేస్తున్నా ఆమె పట్టించుకోదు. తనపని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. 
 
ఒక వైపున నాయిక ప్రధానమైన కథలను.. మరో వైపున సీనియర్ స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీ బిజీగా ఉంటూ ఉంటుంది. తమిళ సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే నయనతార, వీలును బట్టి తెలుగు.. మలయాళ సినిమాలు చేస్తూ ఉంటుంది.
 
దక్షిణాదిలో నయనతార మిగతా అందరి హీరోయిన్స్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటూ ఉంటుంది. ఈ విషయంలో ఆమె ఎంత మాత్రం రాజీ పడదని అంటారు. అయితే ఆమె వర్కింగ్ కూడా అంతే ఉంటుంది. తీసుకున్న పారితోషికానికి ఆమె పూర్తి న్యాయం చేస్తుందని అంటారు. అలాంటి నయనతార 'జవాన్' సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైంది.. భారీ విజయాన్ని పరిచయం చేసుకుంది.
 
దాంతో ఇప్పుడు బాలీవుడ్‌లోని బడా మేకర్స్ ఆమెను తమ సినిమాలకు తీసుకోవడానికి చేస్తున్నారట. సౌత్ వరకే పరిమితమయ్యే తన సినిమాలకు 5 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటున్న నయనతార, పాన్ ఇండియా సినిమాలకుగాను రూ.10 కోట్లు డిమాండ్ చేస్తోందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ మాత్రం పారితోషికాన్ని బాలీవుడ్‌లో కొంతమంది హీరోయిన్స్ అందుకుంటూనే ఉన్నారు. నయన్ ఆ మాత్రం డిమాండ్ చేయడంలో ఆశ్చర్యం కూడా లేదు. కాకపోతే ఆమె డిమాండ్ చేసిందా? లేదా? అనేదే ప్రశ్న. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నయనకు భారీ బాలీవుడ్ ఆఫర్స్.. పారితోషికం అంత డిమాండ్ చేస్తోందట!