Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవితో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టం : నయనతార

Advertiesment
nayanathara
, ఆదివారం, 9 అక్టోబరు 2022 (16:48 IST)
మెగాస్టార్ చిరంజీవితో మరోమారి స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్టు హీరోయిన్ నయనతార అన్నారు. చిరంజీవి - సత్యదేవ్‌ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన 'గాడ్‌ఫాదర్‌' సక్సెస్‌పై నయనతార స్పందించారు. 
 
పొలిటికల్‌ డ్రామా తెరకెక్కిన ఈ చిత్రంలో సత్యప్రియగా కీలకపాత్ర పోషించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ మేరకు ఆమె టీమ్‌లో భాగమైన సభ్యులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెబుతూ ఓ లేఖ విడుదల చేశారు.
 
'గాడ్‌ఫాదర్‌'కు బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందించిన సినీ ప్రియులు, అభిమానులకు ధన్యవాదాలు. కుటుంబ సభ్యులందరితో కలిసి మీరు ఈ చిత్రాన్ని ఎంజాయ్‌ చేస్తున్నందుకు ఆనందిస్తున్నా. ముఖ్యమైన వ్యక్తులు, అద్భుతమైన బృందం వల్ల ఈ సినిమా నాకెంతో ప్రత్యేకంగా మారింది. 
 
ముఖ్యంగా, ‘సైరా’ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవితో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయనొక మంచి వ్యక్తి, గొప్ప నటుడు. సెట్‌లో ఆయనతో ఉన్న ప్రతిక్షణాన్నీ ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా. సత్యప్రియ వంటి కీలకమైన పాత్రకు నేను ప్రాణం పోయగలనని నమ్మి, మూడోసారి తన సినిమాలో నన్ను భాగం చేసిన మోహన్‌రాజాకు కృతజ్ఞతలు. 
 
సల్మాన్‌ఖాన్‌ని అందరూ ఎందుకు ప్రేమిస్తారో ఈ సినిమా తెలియజేస్తుంది. ఈ సినిమా ఇంతటి గొప్ప విజయం సొంతం చేసుకోవడంలో భాగమైన మీకు, నా పాత్ర మరింత అద్భుతంగా వచ్చేందుకు సహకరించిన సహనటులు సత్యదేవ్‌, తాన్యాకు ధన్యవాదాలు. నిర్మాతలు, ఇతర టెక్నీషియన్స్‌ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా' అని నయనతార పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎవరి బతుకు వాళ్లని బతకనివ్వండి.. మీడియాకు మంచు లక్ష్మి వినతి