Publish Date: Wed, 04 Jun 2025 (18:52 IST)
Updated Date: Wed, 04 Jun 2025 (18:56 IST)
దర్శకులు, నిర్మాతలు, హీరోలు తమను కమిట్‌మెంట్స్ ఇవ్వమని అడిగినట్లు పలువురు నటీమణులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మోడల్, నటి మౌనీషా చౌదరీ ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయటపెట్టింది. ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి సినిమాలలో నటించమని నన్ను కోరారని తెలిపింది.
ఇక తన మూవీలో అవకాశం ఇస్తానని నటించాలని నాకు ఆఫర్ కూడా ఇచ్చారని వెల్లడించింది. కానీ నాకు మాత్రం నటించడం ఇష్టం లేదని చెప్పినప్పటికీ అతను మాత్రం వినకుండా నా వెంట పడి నన్ను ఇబ్బంది పెట్టాడని ఆరోపించింది.
అంతేకాకుండా ఒకరోజు నా తొడల కొలతలను కూడా అడిగి టార్చర్ పెట్టారని సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పుడు మాత్రం అతను పెద్ద సెలబ్రిటీలతో పాన్ ఇండియా సినిమాలను చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నారని చెప్పి షాకిచ్చింది.