Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్ళి ఆగిపోయినా యాక్టివ్‌గా షూటింగ్ సెట్లో మెహరీన్

Advertiesment
పెళ్ళి ఆగిపోయినా యాక్టివ్‌గా షూటింగ్ సెట్లో మెహరీన్
, మంగళవారం, 13 జులై 2021 (21:46 IST)
మెహరీన్. గత కొన్నిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనువడు భవ్యబిష్ణేయ్‌తో నిశ్చితార్థం జరగడం.. ఆ తరువాత వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో మెహరీన్ పేరు ఎక్కువగా వినిపించేది.
 
అయితే అనూహ్యంగా భవ్యబిష్ణేయ్‌తో పెళ్ళి రద్దు చేసుకుంటున్నామని.. ఇక తనతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించి అందరికీ షాకిచ్చారు మెహరీన్. దీంతో ఈ బ్యూటీ పెళ్ళిపై వరుసగా కథనాలు వెలువడ్డాయి. 
 
భవ్యబిష్ణేయ్ ఏదో చేయడం వల్లనే పెళ్ళి ఆగిపోయి ఉంటుందని మెహరీన్ అభిమానులు సందేశాలు పంపిస్తుండటం ఆయనకు తీవ్రంగా కోపం తెప్పించదట. తన వ్యక్తిగత విషయాలను గురించి సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టారట. 
 
అయితే పెళ్ళి రద్దు చేసుకున్న తరువాత మెహరీన్ మళ్ళీ షూటింగ్స్‌లో బిజీ అయిపోయారు. తనకు వచ్చిన ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పూర్తిగా కెరీర్ పైన దృష్టి పెట్టారట. ప్రస్తుతం మెహరీన్ వెంకటేష్, వరుణ్‌ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎఫ్‌-3మూవీలో నటిస్తున్నారు.
 
ఇప్పటికే రీసెంట్‌గా స్టార్టయిన షెడ్యూల్లో యాక్టివ్‌గా పాల్గొంటూ ఉన్నారట. ఇదిలా ఉంటే ఇప్పుడు మెహరీన్ తన సోషల్ మీడియా ఖాతాలో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారట. అంతేకాకుండా ఆసక్తికర కామెంట్స్ పెడుతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారట. 
 
మోస్ట్ డేంజరస్ ఆడవాళ్ళు ఎవరో తెలుసా.. పక్కవారిపై ఆధారపడకుండా తనను తాను నమ్ముకున్న వారే అన్న అర్థమొచ్చేలా ఓ ఇంగ్లీష్ సందేశాన్ని అప్‌లోడ్ చేసి మరీ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన‌సూయ చిరున‌వ్వుకు షాకింగ్ కామెంట్లు