నటి అనుష్క శెట్టి చాలాకాలంగా మీడియాకు దూరంగా వుంది. 2019లో సైరా నరసింహారెడ్డి సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయ్‌గా నటించింది. కరోనా టైంలో 2020లో నటించిన నిశ్శబ్దం సినిమా ఓటీటీ ద్వారా ఐదు భాషల్లో విడుదలైంది. అయితే ఆ సినిమా తర్వాత ఆమె అస్సలు ఎలా వుందో కూడా సోషల్‌మీడియాలో తన ఫొటోలు పెట్టలేదు. కొన్ని కారణాలవల్ల సినిమాలకూ దూరంగా వుంటున్నట్లు చెప్పింది. కానీ అనుష్కకు జీరో సైజ్ సినిమా నేపథ్యంలో వైవిధ్యమైన పాత్ర కోసం తన బాడీ విపరీతంగా పెంచుకుంది. ఆ తర్వాత దానిని కంట్రోల్ చేయడానికి చాలా సమయం పట్టింది.
ఈ క్రమంలో ఆమెకు తెలిసిన విద్య యోగా. యోగా ద్వారా పలు వ్యాయామాలు చేస్తూ నియంత్రించుకుంది. త్వరలో పేద్ద బేనర్ సినిమాలో నటించడానికి రంగం సిద్ధం అయినట్లు వార్తలు కూడా వచ్చాయి. అవేవీ ప్రకటనలకు నోచుకోలేదు. ఏదో కారణంగా అనుష్క ప్రచారానికి దూరంగా వుందంటూ వార్తలు వస్తున్నాయి.
అయితే తాజాగా మంగళవారంనాడు తన తల్లిదండ్రులకు వివాహ వార్షికోత్సవం సందర్భంగా పాత ఫొటోలను తన సోషల్ మీడియాలో పెట్టి వారికి శుభాకాంక్షలు తెలిపింది. తుళు భాషలోనూ, ఆంగ్లంలోనూ శుభాకాంక్షలు తెలియజేసింది. బెంగుళూరుకు చెందిన అనుష్క త్వరలోనే అ్రగ హీరో సరసన చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.