Prashanth Varma, DVV Danayya
హనుమాన్ సినిమాతో తన క్రియేటివ్ వర్క్ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ సాధించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నాడు. తక్కువ బడ్జెట్‌తో ఎక్స్‌పెరిబెంటల్ సినిమా చేసి, నిర్మాతల విశ్వాసాన్ని రెట్టింపు చేసిన ప్రశాంత్ కాల్‌షీట్లు కేటాయించడంలో కాస్త దోపిడీ చేశాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మాతలతో అడ్వాన్స్‌ల వివాదం ప్రశాంత్ వర్మ తన తదుపరి సినిమా మీకే అంటూ ప్రముఖ పేరున్న సంస్థలతో పాటు కొత్త నిర్మాతల దగ్గర కూడా అడ్వాన్స్‌లు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.
నిరంజన్ రెడ్డి, సుధాకర్ చెరుకూరి, డి.వి.వి.దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్, హంబలే ఫిల్మ్స్ వంటి పెద్ద సంస్థలు అడ్వాన్సులు ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం రూ.80 నుండి రూ.100 కోట్ల వరకు అడ్వాన్సులు వర్మకి వచ్చాయి. సమస్య వర్మ నిర్ణయాల్లోఒకేసారి ఈంత మంది నిర్మాతలకు సినిమాలు చేయడం కుదరదు. ప్రయత్నంగా, నేను డైరెక్ట్ చేయను. కధ మాత్రమే ఇస్తాను. దర్శకత్వ పర్యవేక్షణ చేస్తాను" అని ఆప్షన్లు ఇవ్వడం ప్రారంభించాడు?. కానీ నిర్మాతలు దీన్ని నమ్మడం లేదు. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయాలి. లేదంటే అడ్వాన్స్ వెనక్కి ఇవ్వాలి.. అని ఒత్తిడి? చేస్తున్నారు.అడ్వాన్స్‌లతో స్టూడియో పెట్టుబడి హనుమాన్ హిట్ తర్వాత ప్రశాంత్ హైదరాబాద్‌లో స్టూడియో నిర్మించాడని సమాచారం.
అడ్వాన్స్‌లు, సినిమా వసూలు మొత్తం మీద నూతన ఆఫీస్ నిర్మాణానికి పెట్టుబడి పెట్టాడు. ఈ నేపథ్యంలో నిర్మాతలకు ఇక డబ్బులు తిరిగి ఇవ్వడం కుదరడం లేదు. దాంతో దర్శకుడిపై నిర్మాతలు తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారని టాక్.? పరిశ్రమలో గందరగోళంఈ వివాదం రూపంలో ప్రశాంత్ వర్మ చేయాల్సిన సినిమాలో కూడా గందరగోళం నెలకొంది. నిర్మాతలు రాజీకి రావడానికి సిద్ధంగా లేరు. ఈ దుమారం నుంచి ఈ యువ దర్శకుడు ఎలా బయటపడతాడో ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ప్రశాంత్ వర్మ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న టాపిక్ పై నిర్మాత డివివి దానయ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రశాంత్ వర్మకు నేను ఇచ్చిన అడ్వాన్స్ అనేది అబద్ధం. అందులో వాస్తవంలేదు. తనకూ నాకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగేలేదని స్పష్టం చేశారు. దీనిని ఇంతటితో ఆపేయాలని నెటిజన్లు కోరుకుంటూ పోస్ట్ చేశారు.