Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

Advertiesment
Thriller Peter Teaser

చిత్రాసేన్

, శుక్రవారం, 31 అక్టోబరు 2025 (16:23 IST)
Thriller Peter Teaser
సస్పెన్స్, థ్రిల్లర్ అనేది ఎప్పుడూ ఎవర్ గ్రీన్‌ జానర్. వృద్ధి స్టూడియోస్ పతాకంపై రవి హిరేమత్, రాకేష్ హెగ్గడే నిర్మాతలుగా సుకేష్ శెట్టి రచించి దర్శకత్వం వహించిన చిత్రం ‘పీటర్’. ఇందులో రాజేష్ ధ్రువ ప్రధాన పాత్రలో నటించగా, జాన్వి రాయల, రవిక్ష శెట్టి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. గురువారం నాడు మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.
 
జెస్సీ మళ్లీ వచ్చింది.. డెవిడ్‌ను ఇక్కడకు తీసుకురా.. చెండే వాయిద్యం అంటే మాకు దైవంతో సమానం.. ఎవరైనా అవమానిస్తే ఊరుకోను.. అంటూ సాగిన టీజర్ ఉత్కంఠను రేకెత్తించేలా సాగింది.  టీజర్‌ను గమనిస్తే కేరళ సంప్రదాయం, కేరళ అందాల్ని అద్భుతంగా చూపించినట్టు కనిపిస్తోంది. టీజర్ కట్ చేసిన విధానం చూస్తుంటే.. సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌లో మరో అద్భుతమైన చిత్రం రానున్నట్టుగా అనిపిస్తోంది. ఈ టీజర్‌లో చూపించిన విజువల్స్, భయపెట్టేలా చూపించిన కెమెరా యాంగిల్స్, వెంటాడే నేపథ్య సంగీతం అన్నీ కూడా హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. పీటర్ కథ ఏంటి? జెస్సీ ఎవరు? అనే ఆసక్తికరమైన అంశాలకు త్వరలోనే సమాధానం రానుంది.
 
రాజేష్ ధ్రువ సినిమాలో ఇంటెన్స్ పర్ఫామెన్స్‌తో, అన్ని రకాల ఎమోషన్స్‌ను పలికించబోతోన్నాడని అర్థం అవుతోంది. సినిమాటోగ్రాఫర్ గురుప్రసాద్ నార్నాడ్ విజువల్స్ ఎంతో సహజంగా కనిపిస్తుండగా.. రిత్విక్ మురళీధర్ సంగీతం భయాన్ని, భావోద్వేగాన్ని పెంచేలా ఉంది. ఎడిటర్ నవీన్ శెట్టి కట్స్ మరింత ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది.
 
త్వరలోనే రిలీజ్‌ కానుంది. అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని ఇతర అప్డేట్‌లను మేకర్లను త్వరలోనే ప్రకటించనున్నారు.
 
తారాగణం : రాజేష్ ధృవ, జాన్వీ రాయల, రవిక్షా శెట్టి, రామ్ నాదగౌడ్, వరుణ్ పటేల్, ప్రతిమా నాయక్, రఘు పాండేశ్వర్, రాధాకృష్ణ కుంబ్లే, దీనా పూజారి, సిద్దు, భరత్, మను కాసర్‌గోడ్, రక్షిత్ దొడ్డెర తదితరులు 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Madalsa Sharma: మదాలస శర్మ కాస్టింగ్ కౌచ్ కామెంట్లు.. కెరీర్‌ ప్రారంభంలోనే?