Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చమ్మక్ చంద్రకు ఎన్ని కష్టాలు, ఆ షోకు నిరాకరిస్తున్నారట..?

Advertiesment
చమ్మక్ చంద్రకు ఎన్ని కష్టాలు, ఆ షోకు నిరాకరిస్తున్నారట..?
, మంగళవారం, 5 జనవరి 2021 (19:03 IST)
జబర్దస్త్ షో చమ్మక్ చంద్రకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. అసలు జబర్దస్త్ షోలో పార్టిసిపేట్ చేసే వారందరికీ మంచి అవకాశమే వచ్చింది. అందుకు కారణం ఆ షోలో వారి పెర్మాన్మెన్స్. రష్మి, అనసూయలే కాదు సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, హైపర్ ఆది ఇలా అందులో ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు లభించింది. 
 
వీరిలో చమ్మక్ చంద్ర ప్రత్యేకం. తనదైన పంచ్ డైలాగులతో అందరినీ బాగా అలరిస్తుంచాడు చమ్మక్ చంద్ర. అయితే చివరకు అదిరింది అనే షోకు నాగబాబుతో పాటు వెళ్ళిపోయాడు చంద్ర. ఆ షోకు వెళ్ళి యేడాది మాత్రమే అవుతోంది. అదిరింది షోకు గతంలో మంచి రెస్పాన్స్ ఉన్నా ఆ తరువాత రానురాను జనం చూడటం తగ్గించేశారు.
 
అసలు అదిరింది షో వస్తుందా లేదా అన్న అనుమానం అందరిలో నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో చమ్మక్ చంద్ర తిరిగి వెళ్ళాలనుకుంటున్నారట. దీంతో అక్కడి నిర్వాహకులు నితిన్, భరత్‌లతో సంప్రదింపులు జరిపారట కూడా. కానీ వారు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది.
 
ఒకసారి ఒక షో వదిలి వేరే ఛానల్ దగ్గరకు వెళితే సాధారణంగానే తీసుకోరు. అందులోను బాగా పాపులర్ అయిన షో నుంచి వెళ్ళడం అనేది చమ్మక్ చంద్ర చేసిన పెద్ద తప్పే అని నిర్వాహకులు అభిప్రాయపడ్డారట. అందుకే నిర్దాక్షిణ్యంగా చమ్మక్ చంద్రకు అవకాశం లేదని చెప్పేస్తున్నారట ఆ నిర్వాహకులు. దీంతో ఆలోచనలో పడ్డారట చమ్మక్ చంద్ర. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గేయ రచయిత వెన్నెలకంటి ఇకలేరు...