టాలీవుడ్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి వివాదంలో చిక్కుకుంది. ఎప్పుడూ పద్ధతిగా వుండే సాయిపల్లవి బికినీలో కనిపించే సరికి అభిమానులు షాక్ అయ్యారు. తాజాగా ఆమె బికినీలో కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చనీయాంశమయ్యాయి.
తన సోదరి పూజా కన్నన్‌తో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ బీచ్‌లో ఆడుకుంటూ కనిపించిన వీరిద్దరూ బికినీ దుస్తుల్లో కనిపించారు. ఇప్పటి వరకు సాయి పల్లవిని ఇలాంటి లుక్‌లో చూడని అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇప్పటివరకు పూర్తిగా నేచురల్ లుక్స్‌లో మాత్రమే మెరిసిన ఈ నటి సడెన్‌గా బికినీలో కనిపించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇకపోతే.. సాయి పల్లవి నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ సరసన సీతగా నటించనున్న రామాయణం కోసం, అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో సునీల్ పాండే దర్శకత్వం వహించనున్న సినిమా కోసం సిద్ధమవుతోంది.