ఓ వాణిజ్య యాడ్ చిత్రీకరిస్తుండగా జరిగిన ప్రమాదంలో హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు చిన్నపాటి గాయమైంది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ కార్యాలయం శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ నగరంలో చిత్రీకరిస్తున్న ఓ యాడ్ షూటింగ్‌లో ఆయన కాలికి స్వల్ప గాయమైంది. వెంటనే ప్రథమ చికిత్స చేసినట్టు సమాచారం.
చిన్న గాయమేనని, అభిమానులు ఆందోళన చెందాల్సిన లేదని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇటీవల వార్2తో ఎన్టీఆర్ ప్రేక్షకులకు పలకరించిన సంగతి తెలిసిందే.