Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

Advertiesment
rajini - balakrishna

ఠాగూర్

, బుధవారం, 30 ఏప్రియల్ 2025 (18:10 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'జైలర్-2'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, ఈ చిత్రంలో టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ అతిథి పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. ఇదే వార్త ఇపుడు నెట్టింట వైరల్ అవుతోంది. 
 
గత కొన్ని రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం నందమూరి బాలకృష్ణను చిత్రం బృందం సంప్రదించగా, యువరత్న బాలకృష్ణ సైతం సమ్మతించినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే, ఈ వార్తలపై మేకర్స్ నుంచి స్పందన లేదు. 
 
గతంలో వచ్చిన 'జైలర్' చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. దీంతో రజనీ - నెల్సన్‌లు రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి భాగంలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్‍ వంటి వారు సినిమాను మలుపు తిప్పే అతిథి పాత్రలో మెరిశారు. ఇపుడు అలాంటి పాత్రనే బాలకృష్ణ పోషించబోతున్నారనే ప్రచారం సాగుతోంది. నిజానికి ఈ చిత్రం తొలి భాగంలోనే బాలకృష్ణను తీసుకోవాలని ప్రయత్నించినట్టు దర్శకుడు నెల్సల్ ఓ సందర్బంలో చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

HIT 3 పహల్గమ్ షూట్ లో ఒకరు చనిపోవడం బాధాకరం: నాని