Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాంకర్ శ్యామలకు హీరోయిన్ ఆఫర్ వచ్చినా అందుకే కాదన్నదట

Advertiesment
Anchor Shyamala
, శుక్రవారం, 10 జనవరి 2020 (14:37 IST)
తెలుగులో ఉన్న హాట్ యాంకర్స్‌లో శ్యామల కూడా ఒకరు. ట్రెడిషనల్‌గా కనిపిస్తూనే చీరలోనే అందాలు ఆరబోస్తుంటుంది ఈ భామ. పెళ్ళి తరువాత కూడా హాట్ షోతో మతులు పోగొడుతోంది. అనసూయ, రష్మి రేంజ్‌లో కాకపోయినా శ్యామలకు కూడా మంచి ఫాలోయింగే ఉంది. తనకు కూడా ఎక్స్‌పోజింగ్ చేయాలని ఉంటుందని అసలు విషయం చెప్పింది ఈమె. 
 
అయితే ఫ్యాన్స్ తిడుతున్నారని అందుకే తాను గ్లామర్ షోకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించి ఈ ముద్దుగుమ్మ. దానికితోడు తను హీరోయిన్‌గా ఎందుకు మారలేదో కూడా చెప్పింది. ఈ ముద్దుగుమ్మ అందంగా ఉంటుంది కాబట్టి ఆమెకు కొందరు హీరోయిన్ ఆఫర్స్ కూడా ఇచ్చారని తెలుస్తుంది. కానీ ఆమె హీరోయిన్ కాకపోవడానికి కారణం తనే అని.. హీరోయిన్‌గా ఉండాలంటే బిజీ అయిపోయివాలని చెబుతోంది. కానీ తను అంత బిజీగా ఉండలేననీ, అన్నింటికంటే ముఖ్యంగా తనకు తిండి, నిద్ర అంటే ప్రాణం అంటోంది. 
 
అంతేకాదు సినిమా హీరోయిన్ కావాలంటే చాలా బాధ్యతగా ఉండాలి. దానికి మంచి గ్లామర్ షో కూడా కోరుకుంటారు. అది తాను చేయలేనని.. అందాలు ఆరబోయడంతో పాటు స్లిమ్‌గా ఉండడం అనేది తన వల్ల కాదని అందుకే హీరోయిన్ అవకాశాలు వచ్చినా కూడా చేయలేదని చెబుతోంది శ్యామల. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'దర్బార్' దుమారం : డబ్బులుంటే ఖైదీలు కూడా షాపింగ్‌కు వెళ్లొచ్చు... ఆమెను ఉద్దేశించేనా?