Publish Date: Tue, 13 Nov 2018 (17:29 IST)
Updated Date: Tue, 13 Nov 2018 (17:32 IST)
అనసూయ. బుల్లితెరపైన, వెండితెరపైన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్ననటి. బుల్లితెరపై ప్రత్యేక కార్యక్రమాల్లో యాంకర్‌గా వ్యవహరిస్తూ అశేష ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. ఇక సినిమాల్లో కూడా అడపాదడపా కొన్ని పాత్రల్లో నటిస్తూ ఉంది. అప్పుడప్పుడు చేస్తున్నా సరే ఆ సినిమాలన్నీ అనసూయకు బాగా కలిసొస్తున్నాయి. మంచి పేరును తీసుకువస్తున్నాయి. అదృష్టం అలా వరిస్తోంది.
ప్రస్తుతం అనసూయ యాత్ర సినిమాలో నటిస్తోంది. దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రపై తీస్తున్న సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ సినిమాలో ఒక కీ రోల్ పోషిస్తోంది అనసూయ. ఒక రాజకీయ నాయకురాలిగా కనిపించబోతోంది. రాజకీయాల గురించి అస్సలు తెలియని అనసూయకు ఆ పాత్ర ఇవ్వడంతో ఇబ్బంది పడుతోందట.
అందుకే ఏదో ఒక పార్టీ నాయకురాలిని కలిసి రాజకీయాలంటే ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలని భావిస్తోందట. రాజశేఖర్ రెడ్డి సినిమా కాబట్టి వైసిపి మహిళా నేతలనే కలిసిందట. అందులోను ఫైర్ బ్రాండ్ రోజాను కలిసి సలహా అడిగిందట. వైసిపిలో రెండవ స్థానంలో ఉన్న రోజా ఇచ్చిన సలహాతో మెళుకువలను నేర్చుకుంటోందట అనసూయ. అయితే అనసూయ రోజాను కలవడంతో ఆమె వైసిపిలోకి వెళుతోందన్న ప్రచారం సినీపరిశ్రమలో ప్రారంభమైందట.