Publish Date: Wed, 06 Jan 2021 (20:33 IST)
Updated Date: Wed, 06 Jan 2021 (20:36 IST)
ప్రేమ కథలన్నీ మామూలుగానే ఉంటాయి. ఇదంతా తెలిసిన విషయమే. సినిమాల్లో ఠక్కున చూపిస్తుంటారు. హీరోయిన్ వెళుతూ ఉంటే హీరో చూసి ఆమె మైకంలో పడిపోయి ప్రేమ పాట అందుకుంటాడు. ఆమె ప్రేమను గెలవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంటాడు.
అయితే నిజజీవితంలో కూడా అల్లుఅర్జున్ అలాంటిదే చేశాడు. ప్రస్తుత తన ధర్మపత్ని స్నేహారెడ్డి ప్రేమను గెలుచుకోవడానికి నానా బాధలు పడ్డారట అల్లు అర్జున్. పెళ్ళయి తొమ్మిది సంవత్సరాల తరువాత ఎందుకు ఈ మాట ఇప్పుడు అల్లుఅర్జున్ చెబుతున్నారని అనుకుంటున్నారా..
తన గతాన్ని గుర్తు చేసుకుంటూ కొన్ని ఫోటోలను అభిమానులకు షేర్ చేస్తూ కొన్ని సందేశాలను పంపుతున్నారట అల్లు అర్జున్. అర్థరాత్రి ఒక పబ్‌లో స్నేహారెడ్డిని చూశాను. తన స్నేహితులతో డ్యాన్స్ వేస్తూ కనిపించింది. అంతే... ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది.
అప్పుడే అనుకున్నాను. నేను ప్రేమలో పడ్డానని.. చాలారోజులు పట్టింది స్నేహారెడ్డిని ప్రేమ ముగ్గులో దించడానికి. నా కుటుంబ నేపథ్యం తెలుసు కాబట్టి స్నేహారెడ్డి కుటుంబ సభ్యులు పెళ్ళికి ఒకే అనేశారు. ఇద్దరం ఒకింటి వారమయ్యాం. ఇద్దరు పిల్లలతో హాయిగా జీవితాన్ని గడుపుతున్నాం అంటున్నాడు బన్నీ.
జె
Publish Date: Wed, 06 Jan 2021 (20:33 IST)
Updated Date: Wed, 06 Jan 2021 (20:36 IST)