అఖిల్ అక్కినేని సక్సెస్స్ కోసం ఎదుచుస్తున్నాడు. ఒక రకంగా తన కెరీర్‌లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఏజెంట్ తర్వాత, విరామం తీసుకుని తన ప్రాజెక్టులను పునరుద్ధరించాడు. వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వం వహిస్తున్న తన ఆరవ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి ఇప్పుడు తిరిగి వచ్చాడు.
తాజా గా లెనిన్ అనే చిత్రం చేస్తున్నారు.ప్రేమ కంటే యుద్ధం హింసాత్మకం కాదు" అనే శీర్షికతో ఈ చిత్రం వస్తుంది. శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ సంగీత దర్శకుడు.
ఇదిలా ఉండగా, ఇటీవల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని సమావేశం కావడం సినీ వర్గాల్లో కొత్త ఊహాగానాలకు దారితీసింది. వివరాల ప్రకారం ప్రశాంత్ నీల్ సన్నిహితులలో ఒకరు అఖిల్ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. కథ ను ఆయన రాసారట. త్యరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.