Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బాలకృష్ణ అఖండ -2?

Advertiesment
akhanda movie still

సెల్వి

, బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (17:03 IST)
నందమూరి బాలకృష్ణతో గీతా ఆర్ట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించనుందనే వార్త ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్ అయిన అఖండ-2ను గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఎంతవరకు నిజమనేది తెలియాల్సి వుంది. ప్రస్తుతం ఈ టాపిక్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. 
 
వాస్తవానికి అఖండ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. బాలయ్య లేదా బోయపాటి సీక్వెల్‌తో ముందుకు సాగాలనుకుంటే.. ఖచ్చితంగా అదే నిర్మాత చేయాలి.
 
ఎవరైనా అఖండ 2 ప్రొడక్షన్‌లోకి ప్రవేశించాల్సి వచ్చినా, అది రవీందర్ రెడ్డితో భాగస్వామ్య వెంచర్ అవుతుంది. మరోవైపు, ఇది గీతా ఆర్ట్స్ కాదని, 14 రీల్స్ బ్యానర్ అఖండ 2ని నిర్మిస్తుందని కొందరు చెబుతున్నారు. కానీ 14 రీల్స్- బోయపాటి బాలయ్యతో రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అఖండ 2 కాదు.
 
మొత్తానికి, బోయపాటి గీతా ఆర్ట్స్ క్యాంప్‌లో బిజీగా ఉండగా, బాలయ్య మరో రెండు సినిమాలు లాకవడంతో అఖండ 2 ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చే అవకాశం లేదనే చెప్పాలి. సో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్ దేవరకొండ "ఫ్యామిలీ స్టార్" నుంచి నందనందనా..' లిరికల్ సాంగ్ వచ్చేసింది